విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 19 న విడుదలైన లియో డివైడ్ టాక్ తోనే 500 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తమిళ్ లో తప్ప మిగతా ఏ భాషలోనూ లియో మెప్పించలేకపాయింది. కానీ లియో కి సరైన పోటీ లేకపోవడం వలన ఆ సినిమా నిర్మాతలు లాభాలు పోగేసుకున్నారు. లేదంటే వయలెన్స్ ఎక్కువైన లియో 500 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడమంటే మాములు విషయం కాదు. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసి.. నెలలోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది అనుకున్నారు.
కానీ మేకర్స్ ఆచి తూచి ఈ చిత్రాన్ని ఈ నెల 24 న ప్యాన్ ఇండియాలోని అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇండియాలోనే ఈనెల 24 న స్ట్రీమింగ్ అవుతుండగా.. వరల్డ్ వైడ్ గా ఈ నెల 28 నుంచి ఆడియన్స్ కి అందుబాటులోకి రానున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటిటి విడుదల డేట్ తో పాటుగా మేకర్స్ ఓ ట్రైలర్ ని కూడా విడుదల చేసారు.