Advertisement
Google Ads BL

మళ్లీ ఆ అస్త్రాన్ని బయటకు తీసిన కేసీఆర్..


తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈసారి బాగా టఫ్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బాగా స్ట్రాంగ్ అయిపోయి వచ్చి వార్‌లో నిలబడింది. ఎదురు లేదనుకున్న గులాబీ పార్టీకి ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటి వరకూ బలమైన ప్రతిపక్షం లేకనే ఈ పార్టీ ఆడిందే ఆట.. పాడిందే పాట అయ్యింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోవడంతో కేసీఆర్‌కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. దీంతో కీలక అస్త్రాన్ని బయటకు తీశారు. అది పాశుపతాస్త్రం అని కేసీఆర్ భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs

జాతీయ స్ఫూర్తి అంటూ కథలు చెబితే ఎలా? 

ఇంతకీ ఆ అస్త్రం ఏంటంటారా? జాతీయవాదం. అయితే ఈ ఎన్నికల సమయానికి దాని పవర్ తగ్గిపోయిందని జనం అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిన పార్టీ. ఆ విషయాన్ని జనంలోకి గట్టిగానే తీసుకెళుతోంది. జనం కూడా తెలంగాణను ఇచ్చిన పార్టీకి కాంగ్రెస్‌కు మంచి గౌరవమే ఇస్తున్నారు. పైగా టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా మార్చిన మీదట.. జాతీయ వాదం, జాతీయ స్ఫూర్తి అంటూ కథలు చెబితే ఎలా? అయితే పక్క రాష్ట్రానికి వెళితేనేమో జాతీయవాదం.. తెలంగాణలో ఉంటే ప్రాంతీయవాదం.

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు పనేంటి?

జనంలోకి ఈ విషయాన్ని ప్రతిపక్షాలు బలంగానే తీసుకెళుతున్నాయి. దీంతో ప్రాంతీయ వాదం ఈసారి వర్కవుట్ అవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు పనేమిటని ప్రశ్నిస్తున్నారు. మరి పక్క రాష్ట్రాలకు వెళితే ఈయనను అక్కడి వాళ్లు ఇదే ప్రశ్న అడుగుతారు కదా. అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటున్నారా? జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ప్రాంతీయవాదాన్ని ఎత్తుకోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రాంతీయవాదాన్ని బయటకు తీయడం.. ఎన్నికలవగానే కట్టగట్టి అటక మీద పెట్టడం కేసీఆర్‌కు అలవాటైపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక చూడాలి.. ఈసారి కేసీఆర్ జాతీయవాదం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో..

KCR pulled out that weapon again..:

What will happen to Congress and BJP in Telangana?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs