Advertisement
Google Ads BL

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం


బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ గాధ్వీ (56).. హఠాత్తుగా మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేసి వచ్చిన అనంతరం ఇంటిలోనే ఆయన గుండెపోటు గురై కుప్పకూలిపోయినట్లుగా ఆయన కుమార్తె సంజీనా తెలిసింది. ఆయన పడిపోవడం గమనించిన వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే సంజయ్ గాధ్వీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారని, ఇది బహుశా హార్ట్ అటాకే అయ్యిందని కుమార్తె సంజీనా మీడియాకు తెలిపారు. అంతేకాదు, ఆయన ఎటువంటి అనారోగ్యం లేదని, హెల్దీగానే ఉన్నారని కూడా ఆమె తెలియజేసింది. ఆయన మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. 

Advertisement
CJ Advs

సంజయ్ గాధ్వీ బాలీవుడ్‌కు తేరే లియే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కిడ్నాప్, మేరే యార్ కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2 వంటి యాక్షన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. ధూమ్ సీక్వెల్స్ చిత్రాలతో దర్శకుడిగా ఆయన స్టార్ రేంజ్‌కి చేరారు. ధూమ్ చిత్రాలను ఆయన తెరకెక్కిన తీరు హాలీవుడ్‌‌ని సైతం ఆశ్చర్యపరిచిందంటే అతిశయోక్తి కానే కాదు. ఆయన మరణ వార్త తెలిసిన వారంతా సంతాపం ప్రకటిస్తూ.. సంజయ్ గాధ్వీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Dhoom Director Sanjay Gadhvi Dies At 56:

Dhoom2 Director Sanjay Gadhvi is No More
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs