Advertisement
Google Ads BL

భర్త వరుణ్ పై లావణ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్


హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకుని మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా ఎంటర్ అయ్యింది. నవంబర్ 1 న వరుణ్ తేజ్ చేత మూడు ముళ్ళు వేయించుకున్న లావణ్య త్రిపాఠి మొదటి దీపావళి పండగని అత్తామామామలతో కలిసి చేసుకుంది. నిన్నమొన్నటివరకు పెళ్లి కి సంబందించిన సెలెబ్రేషన్స్ తోనే గడిపింది. ఇటలీ, హైదరాబాద్, డెహ్రడూన్ రిసెప్షన్స్ అంటూ ఈ కొత్త జంట హడావిడి చేసింది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్-లావణ్య ఇద్దరూ తమ బ్యూటిఫుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక లావణ్య పెళ్లి పనులన్నీ సజావుగా ముగిసి కాస్త రిలాక్స్ అవడంతో పెళ్లి తర్వాత భర్త వరుణ్ తేజ్ పై పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి తమ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా భర్త జాలి, ప్రేమ కేరింగ్ ఉన్న ఎంతో అద్భుతమైన వ్యక్తి. వరుణ్ గురించి ఇంకా చెప్పడానికి చాలా విషయాలున్నాయి. కానీ అవన్నీ చెప్పను. వాటన్నిటిని నాలోనే దాచుకుంటాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా జరిగింది.

అంతా ఓ కలలా జరిగిపోయింది. మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన, బెస్ట్ విషెస్ తెలిపిన వాళ్లందరికీ థాంక్యూ అంటూ లావణ్య త్రిపాఠి తమ పెళ్లి ఫోటోలని షేర్ చేసింది. లావణ్య వరుణ్ తేజ్ పై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Lavanya first post over Varun Tej after marriage:

Lavanya emotional post on Varun Tej
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs