Advertisement
Google Ads BL

కేసీఆర్‌ని దెబ్బకొట్టి కాంగ్రెస్ నిలుస్తుందా?


ఎన్నికలు ఏవైనా మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో గతంలో మాదిరిగా అయితే పరిస్థితులు ఈసారి లేవు. అన్నీ మారిపోయాయి. ఒకవైపు మేనిఫెస్టో.. మరోవైపు కేసీఆర్ పాలనను హైలైట్ చేస్తూ యాడ్స్‌తో కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. ఆరు గ్యారెంటీలతో ముందుగానే జనంలోకి వెళ్లిన హస్తం పార్టీ.. ఆ తరువాత మేనిఫెస్టోను విడుదల చేసి మరింత ఆకట్టుకుంటోంది. మొత్తంగా 42 పేజీల జంబో మేనిఫెస్టోతో ఆరు గ్యారెంటీలతో మొత్తంగా 66 ప్రధానాంశాలతో మేనిఫెస్టోను రూపొందించింది. అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా? వచ్చినా వాటన్నింటినీ అమలు చేస్తుందా? లేదా? అనేది తర్వాత సంగతి. ఇప్పుడు మాత్రం దూసుకెళుతోంది.

Advertisement
CJ Advs

ఓటర్లు కాస్త కనెక్ట్ అయ్యారో..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిలైన అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా విడుదల చేస్తుందట. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్, పాత బకాయిల చెల్లింపు వంటి ప్రధానాంశాలతో మేనిఫెస్టోను తయారు చేసింది. అసలే ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఈ మేనిఫెస్టో దానికి మరింత ప్లస్ అవుతోంది. ఓటర్లు కాస్త కనెక్ట్ అయ్యారో బీఆర్ఎస్‌కు దెబ్బ పడినట్టే. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రాంతీయ సెంటిమెంటును కూడా రెచ్చగొట్టడానికి లేదు. ప్రధాన పార్టీల నేతలంతా తెలంగాణవారే.

అన్ని వర్గాల్లోనూ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత..

ఈసారి తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ పట్టు బాగానే బిగిస్తోంది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాడ్స్ చూస్తే.. ఒకే ఒక్క యాడ్‌లో బీఆర్ఎస్ చేయలేకపోయిన అంశాలన్నింటినీ ఎత్తి చూపారు. బీఆర్ఎస్ పార్టీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోను జనం నమ్మే పరిస్థితి లేదు. పైగా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల్లోనూ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటోంది. పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ప్రత్యేకంగా చెబుతూ యాడ్స్‌ను రూపొందించారు. తద్వారా ఆ విషయాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు హస్తం పార్టీ యత్నిస్తోంది. ఒకరకంగా సక్సెస్ కూడా అవుతోందనే చెప్పాలి. ఇక చూడాలి గులాబీ బాస్‌ను దెబ్బ కొట్టి కాంగ్రెస్ నిలుస్తుందో లేదో..

Congress Party Manifesto In News:

Will Congress stand by hitting KCR?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs