ఈరోజు శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకే రోజు. హౌస్ మేట్స్ నాగ్ ని చూసి వణికిపోయే రోజు. మరి ప్రతి శనివారం లాగే ఈ శనివారం కూడా నాగార్జున గరం గరంగా వచ్చేసారు. రాగానే సీసా పగలగొట్టి మరీ ఒక్కొక్కళ్ళని ఒణికించేశారు. ముఖ్యంగా రతిక, శివాజీకి నాగార్జున ఇచ్చిన క్లాస్ మాములుగా లేదు. రతిక తిట్లను, అలాగే వచ్చే వారం ఆడతా అంటూ కవర్ చెయ్యడం ఇకపై లేదు అని రతికని తిట్టిన నాగార్జున.. శివాజీకి మెత్తగా కాదు గట్టిగానే క్లాస్ పీకారు.
అమరదీప్ నేను గెలుస్తాను అనుకుంటేనే గెలుపు సాధ్యమంటూ అమర్ ఫోటోపై సీసా పగులగొట్టిన నాగార్జున చెల్లెలి కోసం మాత్రమే ఆడతావా అంటూ గౌతమ్ ని టార్గెట్ చేసారు. ఇక ఫ్యామిలీ వీక్ లో నీ ఫోటో టాప్ లో పెట్టారని నువ్వు ఈ వారం ఏమి ఆడకుండా రిలాక్స్ అయ్యావా అంటూ పల్లవి ప్రశాంత్ కి క్లాస్ పీకారు. ఏమ్మా అశ్విని ప్రియాంక నీ నెత్తిమీద సీసా పగలగొడితే ఏదో గట్టిగా కొట్టినట్టుగా మాట్లాడావ్.. అంతగా జాగ్రత్తలు బిగ్ బాస్ తీసుకోరా అని అడిగారు.
దానికి అశ్విని నాకు గట్టిగా కొట్టినట్టు అనిపించింది, ఆ సీసాలో ఎమన్నా తేడా ఉందేమో అంటూ చెప్పింది.. దానితో నాగార్జున పడి పడి కామెడీగా నవ్విన ప్రోమో చూస్తే ఈవారం కంటెస్టెంట్స్ కి నాగార్జున క్లాస్ చాలా సీరియస్ గానే ఉంది అనిపిస్తుంది.