Advertisement
Google Ads BL

అఖిల్ అక్కినేని నెక్స్ట్ అందుకే ఆలస్యం


ఏజెంట్ మూవీ డిసాస్టర్ తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఏజెంట్ లుక్ లోనే అఖిల్ కంటిన్యూ అవుతున్నాడు. ఈమధ్యన మెగాస్టార్ దివాళి పార్టీలో మురిసిన అఖిల్ ఏజెంట్ ప్లాప్ తర్వాత పెద్దగా బయట కనిపించడం లేదు. అయితే అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ ని కొత్త దర్శకుడు అనిల్ తో మొదలు పెట్టబోతున్నాడు, ఆ సినిమాకి టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ధీర అని రిజిస్టర్ కూడా చేయించారని ప్రచారం జరిగింది. అది కూడా యూవీ క్రియేషన్స్‌ లాంటి పెద్ద బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అని అన్నారు.

Advertisement
CJ Advs

అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న న్యూస్ ఏంటంటే.. కొత్త దర్శకుడు, ఫ్లాప్‌ హీరో అయినా కూడా యూవీ వారు ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌ ని ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారట. అనిల్ చెప్పిన కథపై నమ్మకంతో ఉన్న యువి వారు ఇంత భారీగా బడ్జెట్ పెట్టేందుకు డిసైడ్ అయ్యారట. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందట. అతి త్వరలోనే షూటింగ్‌ ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. స్టోరీ లైన్ పట్ల నాగార్జున కూడా చాలా ఆసక్తి కనబర్చారు. ఫైనల్ స్క్రిప్ట్‌ రెడీ అయిన తర్వాత వారు ఓకే చెప్తే షూటింగ్‌ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Akhil Akkineni is next hence the delay:

Decoding the delay in Akhil next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs