Advertisement
Google Ads BL

ఎన్నాళ్లకెన్నాళ్లకు..


RX100తో హీరోగా కార్తికేయ, హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్, దర్శకుడిగా అజయ్ భూపతిలు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ చిత్రంతోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు. అటు కార్తికేయ వరసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు, ఇటు పాయల్ కూడా బాగానే బిజీ అయ్యింది. కానీ పాయల్‌కి RX100 తర్వాత అంతటి విజయం దక్కలేదు, అసలు సక్సెస్ కూడా ఆమె దరి చేరలేదు. అజయ్ భూపతి కూడా మహాసముద్రంతో డిజాస్టర్ కొట్టాడు. అటు అజయ్.. ఇటు పాయల్‌ కూడా సక్సెస్ కోసం సతమతమయ్యారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మంగళవారం సినిమా తెరకెక్కింది. మంగళవారం సినిమా రిలీజ్‌కి ముందు ఎంతగా ప్రమోట్ చేసినా అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వలేదు అనిపించింది. అయితే మేకర్స్ సాహసం చేసి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. అవి మంచి రిజల్ట్ ఇవ్వడమే కాదు.. నిన్న శుక్రవారం విడుదలైన మంగళవారం సినిమాకి క్రిటిక్స్ నుంచి.. ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఫస్ట్ హాఫ్‌లో కొంత లాగ్ అనిపించినా.. సెకండ్ హాఫ్ ట్విస్ట్‌లు, కొన్ని సన్నివేశాలు అదిరిపోయాయని ఓవరాల్ టాక్.

పాయల్‌ నటన మరియు దర్శకుడు అజయ్ భూపతి చాలా సున్నితంగా కొన్ని సన్నివేశాలను డీల్ చేసిన విధానం మంగళవారం‌కి ప్లస్ అయ్యాయి. టైటిల్ వచ్చినప్పుడు నెగెటివ్‌గా టాక్ నడిచినా.. ఇప్పుడు జనాలు సినిమా చూసి పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. దానితో మంగళవారం హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినట్లే. మరి అటు అజయ్ భూపతికి ఇటు పాయల్‌కి ఎన్నో ఏళ్ళకి ఈ రేంజ్ సక్సెస్ దక్కడం వారిరువురుకి సంతోషాన్నిచ్చింది.

Payal Rajput and Ajay Bhupathi Got Hit with Mangalavaaram:

Positive Talk to Mangalavaaram at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs