Advertisement

BB7: శివాజీకి శిష్యుడికి చెడిందా..


బిగ్ బాస్ సీజన్ 7లో 11 వ వారంలో జరిగిన ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్‌లో పలు రకాల రచ్చ తర్వాత ఈ పాస్ ప్రిన్స్ యావర్ చేతికి చిక్కింది. ముందుగా ఈ పాస్‌ని అర్జున్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ పాస్ కోసం అర్జున్ యావర్‌తో టాస్క్ ఆడి ఓడిపోగా... యావర్ ఆ తర్వాత శోభా శెట్టిని తన ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. పల్లవి ప్రశాంత్‌తో కూడా యావర్ ఈ ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం తలపడ్డాడు. ఈ గేమ్‌లో పల్లవి ఓడిపోయాడు. ఇక శోభా శెట్టి అయితే బర్గర్ తినలేక వామిటింగ్ చేసుకుంది. ఫైనల్‌గా శివాజీ-ప్రియాంకతో కలిసి యావర్ ఈ ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఆడగా.. ఫస్ట్ రౌండ్‌లోనే ప్రియాంక ఓడిపోయింది.

Advertisement

ఆ తర్వాత యావర్-శివాజీ మధ్యన బాల్స్ విషయంలో జరుగుతున్న టాపిక్‌లోకి సంచాలక్‌గా వ్యవహరిస్తున్న పల్లవి ప్రశాంత్, శోభా శెట్టిలు వచ్చారు. తుది నిర్ణయం విషయంలో వాళ్ళు డిస్కస్ చేస్తుండగా.. శివాజీ, పల్లవి ప్రశాంత్‌పై ఫైర్ అయ్యాడు. మొదటి రోజు నుంచి పల్లవి ప్రశాంత్‌ని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ విషయంలో మిగతా కంటెస్టెంట్స్ కూడా పల్లవి ప్రశాం‌ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రిన్స్, పల్లవి ప్రశాంత్‌ని తన శిష్యులుగా మార్చేసుకున్నాడు శివాజీ.

అయితే నిన్న రాత్రి జరిగిన టాస్క్‌లో పల్లవి ప్రశాంత్ తన ఆట డిస్టర్బ్ చేస్తున్నాడంటూ శివాజీ పదే పదే అనడం పల్లవిని బాగా హర్ట్ చేసింది. ఆ తర్వాత శివాజీ మీరు మీ నిర్ణయాన్ని చెప్పండి అంటూ శోభని పల్లవి ప్రశాంత్‌ని గట్టిగా అడిగాడు. ఫైనల్‌గా యావర్ విన్ అయ్యాడని శివాజీ అతన్ని హగ్ చేసుకుని పల్లవి ప్రశాంత్‌ని కూడా పిలిచాడు. కానీ నేను సంచాలక్‌గా ఉన్నాను, ఆట అయ్యాకే వస్తాను అంటూ.. అయినా నేనెందుకు మీ గేమ్ డిస్టర్బ్ చేస్తాను? ఇంకా యావర్ ఔట్ అవుతాడని జాగ్రత్తలు చెప్పినా.. అంతేకాని.. మీ ఆట చెడగొట్టాలని కాదు అన్నాడు. ఆతర్వాత శివాజీ ఎన్నిసార్లు పిలిచినా పల్లవి ప్రశాంత్ వెళ్ళలేదు. దానితో శివాజీకి పల్లవికి మధ్యన చెడింది అనుకుంటున్నారు.

Differences Between Sivaji and Pallavi Prasanth:

War Between Guru and Shishya at Bigg Boss House
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement