Advertisement
Google Ads BL

గొప్ప మనసున్న వ్యక్తి.. తారక్!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోటీ నటీనటులతో, ఫ్యాన్స్‌తో, ఫ్యామిలీతో ఎలా ఉంటారో.. అల్లు హీరో అల్లు శిరీష్ తాజాగా సోషల్ మీడియా చేసిన పోస్ట్‌తో తెలిసిపోతుంది. వాస్తవానికి అందరికీ ఎన్టీఆర్ మాటకారి అని, సబ్జెక్ట్ ఏదైనా ఎంతో అనుభవం ఉన్న వాడిలా స్పీచ్ ఇవ్వగల నైపుణ్యం ఎన్టీఆర్ సొంతం అని అంతా అనుకుంటారు. అలాగే తోటివారి పట్ల ఎన్టీఆర్ ఎంత ప్రేమగా ఉంటారో తాజాగా అల్లు శిరీష్ చేసిన పోస్ట్ తెలియజేస్తుంది.

Advertisement
CJ Advs

ఈ మధ్య ఎన్టీఆర్‌పై ఓ వర్గం కావాలని కక్ష కట్టి మరీ ట్రోల్ చేసింది. అదీ కూడా పాలిటిక్స్‌కు సంబంధించి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల టైమ్‌ని కేటాయించిన ఎన్టీఆర్.. ఇకపై వరుసగా సినిమాలు చేసి ఫ్యాన్స్‌ని అలరిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట కోసం ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నాడు. అందుకే పాలిటిక్స్‌ గురించి పట్టించుకోవడం లేదు. పైగా ఆయన పాలిటిక్స్ గురించి ఏదైనా మాట్లాడితే.. రెండు రకాలుగా అర్థాలు తీసి.. ట్రోల్ చేస్తున్నారు. అందుకే.. ఏదయితే అది అయిందని కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అల్లు శిరీష్ చేసిన పోస్ట్‌తో ఎన్టీఆర్ మనసు ఎలాంటిదో.. జనాలకి తెలుస్తోంది.

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు తమ మెగా ప్రిన్సెస్ క్లీంకార జరుపుకుంటున్న మొదటి దీవాళి‌ని పురస్కరించుకుని.. భారీగా సెలబ్రేషన్స్‌ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు వెంకీ, నాగ్, మహేష్, తారక్ వంటి వారంతా హాజరయ్యారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసిన శిరీష్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్.. ఎవరైనా సరే.. ఫొటో అని అడిగితే తారక్ అన్న అందరితో ఒకేలా ఉంటారు. ఎంతో ప్రేమగా వారికి ఫొటో ఇస్తారు. గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శిరీష్ షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

Allu Sirish Post on NTR Goes Viral:

Allu Sirish With Young Tiger NTR.. Photo Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs