Advertisement
Google Ads BL

BB7: రైతు బిడ్డకు శివాజీ ఇచ్చిన స్థానమిదే


బిగ్ బాస్ సీజన్ 7లో తమ తమ స్థానాలేమిటో తేల్చుకోమంటూ హౌస్ మేట్స్ పదిమందికి బిగ్ బాస్ 1 నుంచి 10 నెంబర్లు ఉన్న స్థానాలను ఇచ్చాడు. నెంబర్ 1 నుంచి టాప్ 5 స్థానాల కోసం హౌస్‌మేట్స్ మధ్యన తీవ్ర వాగ్వాదం జరిగింది. అందులో శివాజీ నేను పల్లవి ప్రశాంత్‌కి నెంబర్ 1 ప్లేస్ ఇస్తున్నా అంటూ పల్లవి ప్రశాంత్‌ని నెంబర్ 1 చేశాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ నా ఆట, నన్ను అర్థం చేసుకుని నాకు శివాజీ అన్న నెంబర్ 1 ప్లేస్ ఇచ్చాడు, నా లైఫ్‌లో ఎవ్వరూ ఇవ్వలేదు, కానీ శివాజీ అన్న ఇచ్చాడు అన్నాడు. నేను హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డని, నా ఆట ఇది అంటూ కాలర్ ఎగరేశాడు. 

Advertisement
CJ Advs

అప్పుడు రతిక నువ్వు మొదటి నాలుగు వారాల్లో ఏమ్ గేమ్ ఆడావని నెంబర్ 1 ప్లేస్ ఇవ్వాలి. నువ్వసలు ఎవరు చెబితే ఆడుతున్నావ్, గ్రూప్‌లో ఆడుతున్నావా, కనబడడం లేదు, ఒంటరిగా ఆడుతున్నావా? అంటూ రతిక పల్లవి ప్రశాంత్‌ని రెచ్చగొట్టింది. దానికి పల్లవి ప్రశాంత్ కూడా రతికకి సూపర్ క్లాస్ ఇచ్చాడు. అక్కా ఇటు చూడు మా అమ్మని తిట్టావ్, మా బాపుని తిట్టావ్, నా గెడ్డం పీకుతా అన్నావ్ అంటూ రతికకి గట్టిగా సమాధానం చెప్పాడు. 

కానీ హౌస్ మేట్స్ మాత్రం ఏకగ్రీవంగా శివాజీకి నెంబర్ 1 స్థానాన్ని కట్టబెట్టారు. పల్లవి ప్రశాంత్‌కి నెంబర్ 3 స్థానం ఇచ్చారు. తర్వాత అశ్విని తన స్థానం కోసం గొడవపడుతూ ఆడపిల్లను ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఉమెన్ కార్డు వాడింది. దానితో యావర్ ఇలాంటి మాటలు మాట్లాడకు అశ్విని అంటూ ఫైర్ అయ్యాడు. అర్జున్‌కి, శోభా శెట్టి‌కి కూడా టాప్ 5 స్థానంపై గొడవైంది. కానీ చివరికి బిగ్ బాస్ లాస్ట్ 5 స్థానాల్లో ఉన్న వారికి ఎవిక్షన్ పాస్ కోసం పోటీపడే అవకాశం ఇచ్చి ఇది ఉల్టా ఫుల్టా అంటూ హౌస్ మేట్స్‌కి ట్విస్ట్ ఇచ్చాడు.

Shivaji Gives Number 1 Place to Pallavi Prasanth:

Bigg Boss Telugu Season 7 Latest Episode Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs