Advertisement
Google Ads BL

BB7: ఈ వీక్ డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు


బిగ్ బాస్ సీజన్ 7 చివరి వారాల్లో ఆసక్తికరంగా మారింది. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 ముగియబోతుంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో టాప్ 5‌లో ఎవరుంటారో అనేది ఫ్యామిలీ వీక్ తర్వాత బుల్లితెర ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తున్నారు. టాప్ 5లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్.. అమర్ కానీ ప్రియాంక కానీ టాప్ 5లో ఉండొచ్చని గెస్ చేస్తున్నారు. ఇక హౌస్‌లో అపర చాణుక్యుడిగా శివాజీ తన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. శివాజీ తాను అనుకున్నవి తన శిష్యులైన పల్లవి ప్రశాంత్, యావర్‌లతో చేయించుకుంటున్నాడనే వాదన చాలామంది హౌస్ మేట్స్‌లో, నెటిజెన్లలో ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఈవారం కెప్టెన్‌గా శివాజీ సేఫ్ జోన్‌లో ఉండగా.. పల్లవి ప్రశాంత్‌కి అర్జున్ వేసిన ఒక్క నామినేషన్ మాత్రమే ఉండడంతో అతను తప్ప మిగతా ఎనిమిదిమంది నామినేషన్స్‌లోకి వెళ్లారు. అమరదీప్, ప్రియాంక, యావర్, గౌతమ్, అశ్విని, శోభా శెట్టి, అర్జున్, రతిక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వారం ఓటింగ్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. గత వారం భోలే వెళ్ళిపోయాడు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో సస్పెన్స్ మొదలైంది. అయితే ఈవారం ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్‌ టాప్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. శివాజీ, ప్రశాంత్ నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఫ్యాన్స్ ఓట్లు యావర్‌కి వేస్తున్నారు. 

రెండో స్థానంలో అమర్‌దీప్ ఉండగా.. వీక్ కంటెస్టెంట్ అనుకున్న రతికా మూడో స్థానంలో ఉంది. ఈ వారం ఆమె నామినేషన్స్ ప్రక్రియతో గ్రాఫ్ పెంచుకుంది. అశ్విని నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ ఐదో స్థానంలో, అర్జున్ ఆరో స్థానంలో ఉన్నారని సమాచారం. మరోపక్క మొదటి నుంచి హౌస్‌లో బలమైన ప్లేయర్స్‌గా కనిపించిన ప్రియాంక, శోభా శెట్టి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. డేంజర్ జోన్‌కి దగ్గరగా ఉన్నారంటూ ఓటింగ్ సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ వారం ఓటింగ్స్ ఇలానే కొనసాగితే ప్రియాంక కానీ, శోభా కానీ.. కాదు డబుల్ ఎలిమినేషన్ అంటే వారిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

BB7: This Week 2 Participants In Danger zone:

Bigg Boss Telugu Season 7 This Week Elimination Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs