Advertisement
Google Ads BL

తారక్ ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్


 

Advertisement
CJ Advs


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీతో రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టేశాడు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా వెలుగొందిన తారక్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో కాకుండా డైరెక్ట్ బాలీవుడ్ మూవీతో నార్త్‌లోకి దిగబోతున్నాడు. హ్రితిక్ రోషన్ వార్ 2లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. బిగ్ బడ్జెట్ మూవీతో తారక్ నార్త్ ఎంట్రీ ఇవ్వడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా.. అదే సమయంలో ఆతృతతోనూ ఉన్నారు.

ప్రస్తుతం వార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం విషయంలో తారక్ ఫ్యాన్స్‌లో ఆందోళన కనిపిస్తుంది. కారణం యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టైగర్-3 అట్టర్ ప్లాప్ అయ్యింది. మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా బెటర్‌గా కనిపించిన టైగర్-3 ఇప్పుడు వీక్ డేస్‌లో పూర్తిగా వీకైపోయింది. సోషల్ మీడియాలో టైగర్-3 పై ఒకటే జోకులు పడుతున్నాయి.

యశ్ రాజ్ బ్యానర్ నుంచి వస్తున్న సీక్వెల్స్ విషయంలో జరిగే డ్యామేజ్‌తో ఇప్పుడు వార్ 2‌పై తారక్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. కొత్త కథలు లేవు, కేవలం యాక్షన్ పైనే దర్శకులు ఫోకస్ పెడుతున్నారు కానీ.. కథ విషయంలో లైట్ తీసుకుంటున్నారు, అటు చూస్తే ఆయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు, అదృష్టవశాత్తు బ్రహ్మాస్త్ర కోట్లు పోగేసింది. అందులో కూడా బలమైన కథ కానీ, కథకి తగిన గ్రాఫిక్స్ కానీ లేవు. ఇప్పుడు వార్ 2 కి ఆయాన్‌ని దర్శకుడిగా తీసుకొచ్చారు. ఇదే తారక్ ఫ్యాన్స్‌లో ఉన్న ఆందోళన. టైగర్-3 హిట్ అయితే వాళ్లలో కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఎన్టీఆర్ నార్త్ ఎంట్రీపై ఆతృత స్థానంలో భయం మొదలైంది.

Young Tiger NTR Fans in Tension:

NTR Bollywood Entry Film Creates Tension in Fans <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs