Advertisement
Google Ads BL

దిల్ రాజు కి అన్ని ఎదురు దెబ్బలే


దిల్ రాజుకి సంక్రాంతి పండగ అనేది విపరీతమైన సెంటిమెంట్ పండగ. అందుకే సంక్రాంతి బరిలో ఎంత పెద్ద హీరోలున్నా తన సినిమా రేంజ్ మీడియం అయినా భయపడకుండా బరిలోకి లాగుతాడు, హిట్ కొడతాడు. ఈ ఏడాది కూడా తన సెంటిమెంట్ కారణంగానే చిరు-బాలయ్యలతో విజయ్ వారసుడితో పోటీ పడ్డాడు. అలానే 2024 సంక్రాంతికి రామ్ చరణ్ తో చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం గేమ్ చెంజర్ ని విడుదల చెయ్యాలని అనుకున్నాడు. కానీ శంకర్ సర్ పుణ్యమా గేమ్ చెంజర్ సంక్రాంతికి రాలేని పరిస్థితి. 

Advertisement
CJ Advs

సరే పరశురామ్ తో మొదలు పెట్టిన ఫ్యామిలీ స్టార్ ని అయినా సంక్రాంతికి విడుదల చేద్దామని ఎప్పుడో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రిలీజ్ అంటూ గొప్పగా ప్రకటించాడు. నిన్నమొన్నటివరకు విజయ్ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికే వస్తుంది.. పెద్ద హీరో లైన మహేష్, రవితేజలతో పోటీ పడడం పక్కా అనుకున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ స్టార్ టీజర్ ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. దానితో ఈసారి దిల్ రాజు నమ్మకంగా ఉన్నది అందుకే.. ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికే వస్తుంది అని ఫిక్స్ అయ్యారు

ఇప్పటికి ఇంకా సరిగ్గా రెండు నెలల సమయమే ఉంది సంక్రాంతికి. అటు చూస్తే ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. విదేశీ షెడ్యూల్ విషయంలో బ్యాంకాకా.. అమెరికానా అనే ఊగిసలాటలో టీమ్ ఉంది. ఇలాంటి సమయంలో దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ బిజినెస్ వ్యవహారాలు క్లిష్టంగా ఉన్నాయి, ఈ చిత్రం సంక్రాంతికి రాదనే ఉహాగానాలు మొదలయ్యాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రచారం షురూ అయ్యింది. మరి అదే నిజమైతే దిల్ రాజు కి అటు రామ్ చరణ్, ఇటు విజయ్ హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. చూద్దాం పరశురామ్ ఏం చెయ్యబోతున్నాడో అనేది. 

Family Star release postponed?:

Family Star update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs