Advertisement
Google Ads BL

పిల్లల కోసమే పెళ్లి అంటున్న కరీనా కపూర్


బాలీవుడ్ లో పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్న వ్యక్తులని ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అందులో ముఖ్యంగా శ్రీదేవి ముందు వరసలో. బోని కపూర్ కి పెళ్ళై పిల్లలు ఉండగానే ఆమె బోనిని చాలా ఇష్టపడి వివాహం చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన తార కరీనా కపూర్. తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడైన సైఫ్ అలీఖాన్ కి ఆల్రెడీ పెళ్ళై పిల్లనున్నప్పటికీ సైఫ్ అలీ ఖాన్ ని గాఢంగా ప్రేమించి కరీనా కపూర్ వివాహం చేసుకుని అందరికి  షాకిచ్చింది.

Advertisement
CJ Advs

అంతేకాదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నాం, లేదంటే సహజీవనమే చేసేవాళ్ళం అంటూ చెప్పి మరింతగా షాకిచ్చింది. కరీనా కపూర్ కన్నా ముందే సైఫ్ అలీ ఖాన్ అమృతని వివాహమాడారు. వారికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం లు జన్మించాక.. 2004 లో విభేదాలతో సైఫ్ భార్య అమృతకి విడాకులిచ్చి కరీనా కపూర్ ప్రేమలో పడి 2012 లో పెళ్లి చేసుకున్నారు. అయితే కరీనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పిల్లల కోసం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, లేదంటే సహజీవనం చేస్తే సరిపోతుంది కదా.. 

మేము ఐదేళ్లు సహజీవనం చేసాము. పిల్లలు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నాము. పిల్లలు ఉంటే బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల గురించి ఆలోచించకపోతే పెళ్లి అవసరం లేదు అన్నట్టుగా కరీనా చెప్పిన మాట వింటే అందరూ నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ఇద్దరి బిడ్డల తల్లిగా అటు ఫ్యామిలీ బాధ్యతలు, ఇటు కెరీర్ పరంగాను కరీనా కపూర్ సూపర్ మామ్ గా దూసుకుపోతుంది. 

Bollywood heroine who says marriage is for children:

Kareena Kapoor reveals why she got married to Saif Ali Khan after 5 years of live-in relationship
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs