Advertisement
Google Ads BL

ప్రభాస్ కల్కికి లీకుల షాక్


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కలయికలో ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఈ ఏడాది మహాశివరాత్రికి ప్రకటించారు. అయితే విడుదలకు మరో రెండు నెలల సమయమే ఉంది. కానీ ప్రమోషన్స్ లేవు. అమెరికా వేదికగా గ్రాండ్ గా ఫస్ట్ లుక్ ని, గ్లిమ్ప్స్ ని విడుదల చేసిన యూనిట్ ఇప్పటివరకు మరో అప్ డేట్ ఇవ్వలేదు. మరోపక్క ప్రభాస్ కల్కి ఫస్ట్ లుక్ పై విమర్శలు వచ్చాయి.

Advertisement
CJ Advs

అవన్నీ పక్కనబెడితే కల్కి మూవీకి లీకులు బెడద ఎప్పటికప్పుడు యూనిట్ కి షాకులు ఇస్తున్నాయి. రెండు నెలల క్రితం కల్కి నుంచి ఓ పోస్టర్ లీకై సెన్సేషనల్ క్రియేట్ చెయ్యగా.. ఆ విషయంలో యూనిట్ ఆగ్రహంతో లీగల్ నోటీసులు ఇచ్చి హడావిడి చేసారు. ఎంత పకడ్బందీగా చేసినా.. మరోసారి దీపికాకి సంబందించిన వీడియో లీకైంది. దీపికా పదుకొనె పాత్ర తాలూకు వీడియో లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి యూనిట్ షాక్ అయ్యింది. 

ఆ షాక్ లో నుంచి వెంటనే తేరుకుని కల్కి లీకు వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించేలోపే అది వైరల్ గా మారింది. ప్రభాస్ ఫాన్స్ కూడా ఆ వీడియోని వైరల్ చెయ్యొద్దని వేడుకుంటున్నారు. అయితే మరో పక్క సరైన అప్ డేట్స్ లేకపోతే చిర్రెత్తుకొచ్చే ఫాన్స్ ఇలాంటి లీకులకి పాల్పడతారు.. అంటూ మరో వాదన వినిపిస్తుంది. 

Kalki 2898 AD gets leakage shock:

Kalki 2898AD shoot video leaked once again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs