ఏ చిత్రంలో అయినా ఐటమ్ సాంగ్ ఉంది అంటే.. అందులో హీరో కూడా ఆ ఐటమ్ పాపతో స్టెప్స్ వేస్తాడు. సాంగ్ మొత్తం లేకపోయినా.. ఎక్కడో ఓ చోట హీరో కనబడాల్సిందే. అప్పుడే అభిమానులకి ఊపు వస్తుంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఐటమ్స్ సాంగ్స్ పక్కా లోకల్ లో కాజల్ తో ఎన్టీఆర్ కాలు కదిపారు, అలాగే రామ్ చరణ్ రంగస్థలంలో పూజ హెగ్డే తో కలిసి డాన్స్ చేసారు. ఇక ఉ అంటావా మావా ఊఉ అంటావా మావా అంటూ సమంత, అల్లు అర్జున్ లు ఊపేసారు. ఇలా హీరో కూడా కాస్త స్టెప్పులేస్తేనే ఆ ఐటమ్ సాంగ్ కి ఓ అందం అనేది.
కానీ ఇప్పుడు సలార్ లో ఉండబోయే ఐటమ్ సాంగ్ లో హీరో ప్రభాస్ కనిపించరనే న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని బాగా డిస్పాయింట్ చేస్తుంది. సలార్ మూవీలో రెండు పాటలు ఉంటాయి. అందులో ఒకటి అమ్మపై వచ్చే పాట, మరొకటి ఐటమ్ సాంగ్ అంటున్నారు. ఆ సాంగ్ లో ప్రభాస్ కనిపించాడు, ప్రభాస్ లేనప్పుడు ఆ సాంగ్ ని చిత్రీకరించారంటూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన న్యూస్ చూసి ప్రభాస్ లేకుండా ఐటమ్ సాంగ్ ఏమిటి గురూ అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ని కనీసం ఐటమ్ లో చూస్తామనుకున్నారు. కానీ ఇప్పుడు కాదు అంటున్నారు. ఇక డిసెంబర్ 1 న సలార్ ట్రైలర్ కోసం మేకర్స్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో ఈవెంట్స్ ని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.