విజయ్ నటించిన లియో సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19 న విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్ ఉంది. అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలయ్యాక లోకేష్ కనగరాజేనా ఈ చిత్రాన్ని తెరకెక్కించింది అని అందరూ ఆశ్చర్యపోయారు. లియో మూవీకి తమిళనాట హిట్ టాక్ వచ్చినా.. తెలుగులోను అలాగే ప్యాన్ ఇండియాలోని మిగతా భాషల్లో డిసాస్టర్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ లోకేష్ కనగరాజ్ మీదున్న క్రేజ్ తో లియో కి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ వీకెండ్ లో కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.
ఫైనల్ గా లియో మూడు వారాల్లో 500 కోట్ల క్లబ్బులో నిలవడంతో చెన్నై లో ఈమధ్యన సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఓ రేంజ్ లో నిర్వహించింది యూనిట్. అయితే ఈచిత్రం ఓటిటి స్ట్రీమింగ్ ముందుగా నవంబర్ 21 నుంచి అవ్వొచ్చనే ఊహాగానాలు నడిచాయి. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు లియో ఒక వారం ముందుగానే ఓటిటిలోకి వచ్చేస్తుంది అంటున్నారు. కారణం లియో ఆన్ లైన్ లో లీకవడంతో మేకర్స్ ఒక వారం ముందుగానే స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారంటున్నారు.
మరి ఈ వారంలోనే లియో ఓటిటి స్ట్రీమింగ్ ఉంటుంది అనే ప్రచారం మొదలైనా.. నెట్ ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా అయితే డేట్ లాక్ చెయ్యలేదు.