Advertisement
Google Ads BL

మహేష్-వెంకీలతో ఆర్.ఆర్.ఆర్ హీరోలు


స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు ఆయా హీరోలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆర్.ఆర్.ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి కనిపిస్తేనే అభిమానులు ఆగలేదు. ఒక హీరో ఇంట్లో పార్టీ జరిగితే అక్కడికి మరో హీరో హాజరైతే చాలు పండగే పండగ. ఇక తాజాగా నిన్న శనివారం రాత్రి హీరోలంతా కలిసి ఒకే చోట పార్టీలో పాల్గొన్న విషయం ఇప్పుడిప్పుడే బయటికి వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరు ఇంట్లో దివాళీ బాష్ లో టాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

అందులో విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ ప్రముఖ హీరోలు మెగా పార్టీకి హాజరయ్యారు. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ ఆ పార్టీకి వెళుతున్న దృశ్యాలు వైరల్ కాగా.. ఇప్పుడు వెంకీ మామతో ఎన్టీఆర్,మహేష్ తో రామ్ చరణ్ కలిసి ఉన్న పిక్ బయటికి వచ్చింది. అది చూడగానే వెంకీ, మహేష్ లతో ఆర్.ఆర్.ఆర్ హీరోలంటూ అభిమానులు ముద్దుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇలా సింగిల్ ఫ్రేమ్ లో మహేష్-ఎన్టీఆర్-రామ్ చరణ్-వెంకటేష్ కనిపిస్తే మనకే కన్నుల పండుగగా ఉంటే అభిమానులకి ఉండడంలో ఆశ్చర్యం లేదు. 

ప్రస్తుతం వెంకీ, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫ్రేమ్ ని సోషల్ మీడియాలో హీరోల అభిమానులు షేర్లు చేస్తూ లైక్స్ కొడుతూ హంగామా చేస్తున్నారు.

NTR, Ram Charan, Mahesh, Venkatesh gives Diwali Delight:

Stars NTR, Ram Charan, Mahesh, Venky sparkle
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs