మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లోనే అద్దిరిపోయేపార్టీ ఇచ్చారు. అంటే చిరు ఇచ్చింది ఏ పెళ్లి పార్టీనో అనుకునేరు.. మెగాఫ్యామిలీలో గత కొన్నేళ్లుగా దివాళి సెలెబ్రేషన్స్ కి ముందు రోజే గ్రాండ్ గా దానిని సెలెబ్రేట్ చేసుకోవడం పార్టీ చేసుకోవడం చూస్తున్నాం. గత ఏడాది మెగాస్టార్ ఫ్యామిలీతో కలిసి దివాళి పార్టీ చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన లు హోస్ట్ లుగా ఈ పార్టీని ఆరెంజ్ చేసారు. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసి చేసుకున్న ఈ పార్టీకి కొంతమంది స్టార్స్ కూడా హారయ్యారు.
గత ఏడాది ఏమో కానీ.. ఈ ఏడాది మెగాస్టార్ ఇంట్లో దివాళీ బాష్ ఓ రేంజ్ లో జరిగినట్లుగా తెలుస్తుంది. మెగాస్టార్ ఇచ్చిన ఈ పార్టీకి పలువురు ప్రముఖులతో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు ప్రత్యేకంగా హాజరైన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ఈ దివాళీ పార్టీకి సంబంధించి ఏ పిక్స్ అధికారికంగా విడుదల కాకపోయినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కారులో మెగాస్టార్ ఇంటికి వెళుతున్న వీడియో, మహేష్ కారులో వెళుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.