వైసీపీ అంటేనే దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అని ఏపీలో అంతా అంటూ ఉంటారు. నిజంగా ఆ పార్టీ చేస్తున్న కొన్ని పనులను చూస్తుంటే అది నిజమేనని మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా ఓ లేఖ తెగ వైరల్ అవుతోంది. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గాన్ని ఊటంకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు రాసినట్టుగా ఉందా లేఖ. ఆ లేఖలో కమ్మ సామాజిక వర్గమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని చెబుతున్నట్టుగా ఉందా లేఖ సారాంశం. ఆ లేఖను పట్టుకుని వైసీపీ దిగజారుడు రాజకీయాలకు తెరదీసింది. దీనిపై టీడీపీ మండిపడుతోంది. చివరకు చంద్రబాబు సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మరీ ఈ లేఖను వైసీపీ సృష్టించిందని టీడీపీ ఆరోపిస్తోంది.
జైలుకు వెళ్లినా పోరాటాలు ఆపొద్దు..
“నేను కమ్మ సామాజికవర్గానికి చాలా చేశా. ప్రస్తుతం టీడీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.. కనుక మీరందరూ మద్దతు ఇవ్వాలి. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేకపోవడం వలన మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఏపీలో వైసీపీ మన సామాజిక వర్గాన్ని పెత్తందారులు అనే ముద్ర వేసి అవమానిస్తోంది. ఓ సీనియర్ రాజకీయ నేతగా నాకు జరిగిన అవమానం జీర్ణించుకోలేనిది. ఒకవేళ నేను మళ్ళీ జైలుకి వెళ్ళినా మీ పోరాటాలు ఆపవద్దు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీరందరూ తోడ్పడాలి’’ అని చంద్రబాబు నాయుడు కోరిన్నట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే చంద్రబాబుపై లేని పోని ఆరోపణలు అన్నీ మోపి ఆయన్ను 70 ఏళ్ల వయసులో దాదాపు రెండు నెలల పాటు జైలులో పెట్టారు.
సొంత మీడియా దీర్ఘాలు..
అది చాలదన్నట్టుగా ఇలాంటి లేఖలు సృష్టించి టీడీపీని మరింత బదనాం చేయాలని వైసీపీ కుట్ర పన్నుతోందని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఓ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఓ లేఖ రాయడమనేది ఆయన చరిత్రలోనే లేదు. అసలు అలా రాస్తారనుకోవడం అంత అవివేకం మరొకటి లేదు. అలాంటి లేని లేఖకు కమ్మ సామాజిక వర్గమేనా? మిగిలిన వాళ్లు ఏం పాపం చేశారంటూ ఆయన సొంత మీడియా దీర్ఘాలు తీయడం జుగుప్సను కలిగిస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో గత ఎన్నికల సమయం నుంచి కూడా బీభత్సమైన యాక్టివ్‌గా మారింది. అప్పటి నుంచి కూడా ఈ తరహా రాజకీయమే. ఇక ఈ సారి గెలవమన్న భయమో ఏమో కానీ మరింత దిగజారి పోయి మరీ పోస్టులు పెడుతోంది. ఇలాంటి పనులు చేసి జనం దృష్టిలో చులకన అవడం తప్ప ఒరిగేది శూన్యం.