బిగ్ బాస్ సీజన్ 7 లో పదో వారం ఎలిమినేషన్ పై ఎవ్వరిలో ఆసక్తి లేదు. కారణం ఒకసారి ఎలిమినేట్ అయ్యి ఉల్టా పూల్టా అంటూ మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతికానే ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అనేది జనాలు ఓ అంచనాకి వచ్చేసారు. హౌస్ లో సోది, శివాజీ బ్యాచ్ తో కబుర్లు తప్ప ఆటలో పెద్దగా యాక్టీవ్ గా కనిపించని రతిక.. రాజమాతాల్లో ఒక్కరు నామినేషన్స్ లో ఉండాలని బిగ్ బాస్.. చెప్పగా రతిక, ప్రియాంకలకి రెండు రెండు ఓట్స్ పడ్డాయి. దానితో కెప్టెన్ శోభా శెట్టి డెసిషన్ తీసుకుని ఆమె రతికా పేరు చెప్పింది. అలా నామినేషన్స్ లోకి వచ్చిన రేపు ఆదివారం ఎలిమినేట్ అన్నారు.
ఇప్పటికే బిగ్ బాస్ లీకుల ద్వారా ఈ పదో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ పూర్తయ్యింది.. రతికనే ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది అంటూ కొన్ని లీకులు కనిపిస్తే.. కాదు కాదు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అమ్మాయిలతో తగువులు పెట్టుకుని, ఇప్పుడు కుదురుకున్న భోలే ఈ వారం ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో లీకులు గుప్పుమన్నాయి. భోలే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు, ఆ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయ్యింది అంటూ పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే రెండు వారాల ఆట బాగోకపోయినా.. భోలే ఇప్పుడు కాస్త ఆటగాడిగా మారాడు, కాని ఫ్యామిలీ వీక్ లో ఆయన భార్య వచ్చినప్పుడు అది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోవడమే భోలే ఎలిమినేషన్ కి రీజన్ అంటుంటే.. అసలు భోలే ఎలిమినేషన్ నాట్ ఫెయిర్ అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు రతికా ఎలిమినేట్ అయ్యిందో.. భోలే ఎలిమినేట్ అయ్యాడో అనేది ప్రస్తుతం సస్పెన్స్.