Advertisement
Google Ads BL

ఊరించి ఊరించి.. ఉసూరుమనిపించారు


గేమ్ చెంజర్ నుంచి అప్ డేట్ కోసం వెయిట్ చేసి చేసి మెగా ఫాన్స్ కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్-శంకర్ కాంబోలో గేమ్ చెంజర్ మొదలై రెండేళ్లు పూర్తవడంతో.. మెగా ఫాన్స్ గేమ్ చెంజర్ అప్ డేట్ విషయంలో ఆ సినిమా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ ని నిందిస్తున్నారు. ఇక దసరా ముందు నుంచే గేమ్ చెంజర్ ఫస్ట్ సింగిల్ పై ప్రచారం జరుగుతున్న సమయంలో మేకర్స్ దివాళికి గేమ్ చెంజర్ నుంచి ఫస్ట్ సింగిల్.. జరగనుంది జరగనుంది సాంగ్ ఇస్తున్నట్టుగా పోస్టర్ తో ప్రకటించారు.

Advertisement
CJ Advs

అప్పటినుంచి మెగా ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు. రామ్ చరణ్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ తప్ప ఇంతవరకు మరో అప్ డేట్ లేకపోవడంతో ఈపాట పై అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి మొదలైంది. అయితే అంతగా ఊరించి ఊరించి ఇప్పుడు మేకర్స్ ఫాన్స్ ని ఉసూరుమనిపించారు. గేమ్ చెంజర్ నుంచి జరగనుంది జరగనుంది పాటని విడుదల చెయ్యలేకపోతున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసారు. అయితే ఎందుకు పోస్ట్ పోన్ అయ్యిందో కూడా చెప్పారు.

కొన్ని కంపెనీల మధ్యన ఆడియో రైట్స్ కి సంబందించిన డాక్యుమెంటేషన్ సంతకాలు ఇంకా పూర్తికాని కారణంగానే గేమ్ చెంజర్ పాటను విడుదల పోస్ట్ పోన్ చేశామంటూ దానికి కారణాలు చెప్పారు. అయితే గత రెండు రోజులుగా గేమ్ చెంజర్ పాట పాడిన సింగర్ ని తప్పించి మరో సింగర్ తో ఆ పాట పాడించడంతో పాట విడుదల ఆలస్యమవుతుంది అంటూ వార్తలు వినిపించాయి, కానీ నిర్మాత దిల్ రాజు వేరే కారణం వెల్లడించారు. ఏది ఐమైనా ఫాన్స్ మాత్రం ఫుల్ గా డిస్పాయింట్ అవుతున్నారు. 

One More Setback For Game Changer:

Game Changer First Single Jaragandi Release Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs