Advertisement
Google Ads BL

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ విచిత్రాలే


తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకచోట భార్యాభర్తలు.. ఇంకోచోట తండ్రీకూతుళ్లు.. మరోచోట బావా మరదళ్లు.. ఇంకొన్ని స్థానాల్లో బాబాయ్‌, అబ్బాయ్‌, అమ్మాయ్‌. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలివి. బంధువుల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. దాంతారాంగడ్‌లో కాంగ్రెస్ తరుఫున వీరేంద్ర సింగ్.. జన్ నాయక్ జనతా పార్టీ తరుఫున ఆయన భార్య రీటా పోటీ చేస్తున్నారు. ఇదే ఆసక్తికరమంటే.. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రేంద్ర తండ్రి నారాయణ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అగ్రనేత కావడం.

Advertisement
CJ Advs

ధోల్‌పూర్‌లో బీజేపీ తరుఫున శివచరణ్‌ కుష్‌వహా పోటీ చేస్తుండగా.. ఆయన మరదలు శోభారాణి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. బావామరదళ్ల పోటీ ఆసక్తికరంగా మారింది. ఆళ్వార్‌లో బీజేపీ నుంచి జయరామ్ జాటప్‌కు టికెట్ ఇచ్చింది. అదే స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన కుమార్తె మీనా కుమారి పోటీ చేస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాల నేపథ్యంలో కూతురు తండ్రినే సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. 

ఆయనతో విభేదాల నేపథ్యంలో కుమార్తె మీనాకుమారి ఏకంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తండ్రినే సవాలు చేస్తున్నారు! ఇద్దరు పరస్పరం జోరుగా విమర్శల వర్షం కురిపించుకుంటూ ఓటర్లకు యథాశక్తి వినోదం పంచుతున్నారు. 

బాబాయ్‌–అబ్బాయ్‌–అమ్మాయ్‌ 

భాద్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ నుంచి సంజీవ్‌ బెనీవాల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయన అన్న కుమారుడు అజిత్‌ బెనీవాల్‌ బరిలో దిగి బాబాయ్‌ని సవాలు చేస్తున్నారు. ఖెత్డీ అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మనీషా గుజ్జర్‌ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆమె బాబాయ్‌ ధర్మపాల్‌ బరిలో దిగారు. నాగౌర్‌లో బీజేపీ నుంచి జ్యోతీ మీర్ధా పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ తరఫున ఆమెకు బాబాయ్‌ వరసయ్యే హరేంద్ర మీర్ధా బరిలో ఉన్నారు. సోజత్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ ఆర్య బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన బంధువు శోభా చౌహాన్‌ పోటీలో దిగారు. 

ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌ 

బస్సీ అసెంబ్లీ స్థానంలో మరో రకం పోటీ నెలకొంది. మాజీ ఐఏఎస్‌ చంద్రమోహన్‌ మీనా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయనపై పోటీ చేస్తున్న లక్ష్మణ్‌ మీనా మాజీ ఐపీఎస్‌ అధికారి కావడం విశేషం. పైగా వీరిద్దరూ బంధువులే. 

నా కుమారుడికి ఓటు వేయొద్దు! 

ఖండార్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున అశోక్‌ బైర్వా బరిలో ఉన్నారు. తండ్రి డాల్‌చంద్‌తో ఆయనకు చాలాకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నా కొడుక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి’ అంటూ డాల్‌చంద్‌ జోరుగా ప్రచారం చేస్తుండటం విశేషం. దాంతో ఏమీ చేయలేక అశోక్‌ తలపట్టుకుంటున్నారు.

Everything is strange in assembly elections:

Image oddities in assembly elections of many states
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs