Advertisement
Google Ads BL

బాలయ్య NBK109 షూటింగ్ అప్ డేట్


నందమూరి  బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ గతరాత్రి టీమ్ అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ వాల్తేర్ వీరయ్యతో హిట్ కొట్టిన దర్శకుడు బాబి తో తన NBK109 ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడమే కాదు నిన్న నవంబర్ 6 న పవర్ ఫుల్ పోస్టర్ వదిలి షూటింగ్ స్టార్ట్ చేసిట్లుగా అప్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

నవంబర్ 6 నుంచి హైదరాబాద్ నగర శివార్లలోని BHEL లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ చేపట్టారు. ఇక తదుపరి షెడ్యూ ని బాబీ ఊటీలో ప్లాన్ చేసాడట. ఆ షెడ్యూల్ నవంబర్ 19 నుంచి మొదలు పెట్టి డిసెంబర్ 5 వరకు ఏకధాటిగా చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. త్రిష అయితే బావుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారు. NBK109 పవర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ తెరకెక్కించబోతున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ చివరి వారంలో విడుదల చేసేందుకు బాలయ్య టార్గెట్ పెట్టుకున్నట్లుగా టాక్. అంటే 2024 ఎన్నికల కన్నా ముందే బాలయ్య-బాబీ NBK109 చిత్రం విడుదల చెయ్యాలనే టార్గెట్ తో షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారట. 

NBK109 shooting update:

Balakrishna NBK109 shooting update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs