Advertisement
Google Ads BL

మూడు సమస్యలతో సమంత సతమతం


సమంత ప్రస్తుతం సినిమాలకి, షూటింగ్స్ కి, నటనకి దూరంగా ఉన్నా సోషల్ మీడియాకి, కమర్షియల్ యాడ్స్, ఫోటో షూట్స్ కి కి దగ్గరగానే ఉంది. మాయోసైటిస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత మధ్య మధ్యలో ఫోటో షూట్స్ అంటూ హడావిడి చేస్తూ ఉనికిని చాటుకుంటుంది. ఫోటో షూట్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న ఆమె తాజాగా గత రెండేళ్లలో తన లైఫ్ ని చుట్టుముట్టిన సమస్య వలన తాను ఎంతగా కుంగిపోయానో అని, కానీ పోరాడి గెలిచాను అంటూ సమంత తన సక్సెస్ స్టోరీని బయటపెట్టింది.

Advertisement
CJ Advs

తన జీవితంలో విడాకులు, అనారోగ్యం, సినిమాలు కూడా ఆ సమయంలో ప్లాప్ అవడంతో చాలా బాధపడ్డాను. ప్రతి వారి జీవితంలో వివాహ జీవితం ఎంతో ఇంపార్టెంట్. అది నా జీవితంలో ముగిసిపోయింది. మరోపక్క నా ఆరోగ్యం దెబ్బతింటుంటే, అదే సమయంలో నేను నటించిన సినిమాలు కూడా ప్లాప్ అవడంతో ఎంతో ఇబ్బందిపడ్డాను, గత రెండేళ్ల నుంచి నా జీవితానికి చుట్టుముట్టిన సమ్యలతో బాధపడ్డాను. ఆ టైమ్ లోనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారి కథలు చదివాను.

వారి కథలతో బాగా ఇన్స్పైర్ అయ్యాను. అంతేకాదు సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాను. ఆందోళనకి గురైన వారి కథలు చదివాను. దాని నుంచి ఎంతో నేర్చుకున్నాను, సెలబ్రిటీస్ అంటే వారు ధరించే దుస్తులు, సినిమాలు, అవార్డులు మాత్రమే కాదు.. వారి జీవితంలోను బాధలు కష్టాలు ఉంటాయి. కాబట్టి నా బాధలు ఇలా బయటపడడం వలన నాకెలాంటి బాధలేదు. నేనే కాదు నాలాగే చాలామందికి సమస్యలుంటాయి. వారంతా కూడా పోరాడాలని ఆశిస్తున్నాను అంటూ సమంత తన సమస్యలు గురించి చెప్పుకొచ్చింది. 

Samantha on failed marriage and challenges:

Samantha shares her secrets on Bazaar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs