Advertisement
Google Ads BL

లాల్ సలాం: రజినీ ఫాన్స్ కి బిగ్ షాక్


జైలర్ సక్సెస్ తో మంచి ఊపుమీదున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తమ కుమార్తె డైరెక్షన్ లో లాల్ సలాం మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్ తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రజినీకాంత్ మొయిదీన్ భాయ్ లుక్ అభిమానులని బాగా ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు.. అంచనాలు మరింతగా పెరిగేలా చేసింది. ఈ చిత్రానికి సంబందించిన డబ్బింగ్ కూడా సూపర్ స్టార్ ఇప్పటికే పూర్తి చేసారు. ప్రస్తుతం లాల్ సలాం షూటింగ్ చిత్రీకరణ చివరిదశలో ఉంది.

Advertisement
CJ Advs

ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి సంబందించిన సన్నివేశాలను భద్రపరిచిన హార్డ్ డిస్క్ లోని కొన్ని సీన్స్ డిలేట్ అయ్యాయనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజినీకాంత్ కి సంబందించిన పలు సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ లోని సీన్స్ మాయమవడంపై యూనిట్ కూడా షాక్ లో ఉందట. ఆ సీన్స్ ని ఎలాగోలా వెతికి తీసేందుకు విదేశాల నుంచి నిపుణులని కూడా లాల్ సలాం మేకర్స్ రప్పిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ గందరగోళంలో లాల్ సలాం ని సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ఇష్టపడం లేదట. ఒకవేళ ఆ హార్డ్ డిస్క్ లో రజినీ సన్నివేశాలు దొరక్కపోతే మళ్ళీ చిత్రీకరించాలని, అదే గనక జరిగితే మరో రెండు నెలల్లో సినిమాని విడుదల చెయ్యడం అసాధ్యమనే మాట వినిపిస్తుంది. రిలీజ్ డేట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇది విన్న రజినీకాంత్ అభిమానులు షాకవుతున్నారు. జైలర్ సక్సెస్ ఊపులో లాల్ సలాం వస్తే ఆ క్రేజే వేరు కదా.. ఇప్పుడు అదే వారి బాధ. 

Lal Salaam: Big shock for Rajini fans:

Lal Salaam Movie issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs