ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ మొదలయ్యింది. నిన్న మంగళవారం శివాజీ కొడుకు రాకతో మొదలైన ఫ్యామిలీ వీక్ స్టిల్ ఈరోజు కూడా కొనసాగింది. కొడుకుని హత్తుకుని శివాజీ చిన్నపిల్లాడిలా ఎమోషనల్ గా మారిపోయాడు. ఆ తర్వాత అర్జున్ అంబటి వైఫ్ ఎంటర్ అయ్యింది. ఆమె ప్రెగ్నెంట్ అవడంతో అర్జున్ కూడా అందరితో కన్నీళ్లు పెట్టించాడు. ఇక అశ్విని అయితే తన తల్లిని చూడగానే విపరీతంగా ఏడ్చేసింది. ఆమె అతిగా రియాక్ట్ అయ్యింది అనాలో.. అసలు ఆమె తత్త్వం అంతే అని సరిపెట్టుకోవాలో అర్ధం కాక బుల్లితెర ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు. అశ్విని తో పాటుగా ఆమె తల్లి వెళ్లేవరకూ ఏడుస్తూనే ఉంది.
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో డాక్టర్ గౌతమ్ తల్లి వచ్చి హౌస్ మేట్స్ ని ప్రేమగా హగ్ చేసుకోవడమే కాదు.. అందరికి గోరు ముద్దలు తినిపించింది. యావర్ ని నువ్వు కూడా నా కొడుకువి అంటూ ప్రేమతో దగ్గరికి తీసుకున్న ప్రోమో వైరల్ అయ్యింది. ఆమె ఉన్నంతసేపు హౌస్ లో చాలా సందడి కనిపించింది.
ఆ తర్వాత ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ వచ్చాడు. అతనూ నటుడే. శివ వచ్చినప్పటినుంచి ప్రియాంక కి ముద్దులు పెడుతూనే ఉన్నాడు. ఐ మిస్ యు అంటూ, మిస్ యు అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు. మనం పెళ్లి చేసుకుందాం అని ప్రియాంక అడిగితే నువ్వు బయటికి రాగానే చేసుకుందామన్నాడు శివ. కాదు ఇప్పుడే అంటూ ప్రియాంక గారాలు పోయింది. ఇక శివ వెళ్ళేటప్పుడు ప్రియాంక ఎమోషన్ అవ్వగా శివ ముద్దు పెడుతూ వెళ్లిన ప్రోమో వైరల్ గా మారింది.