Advertisement
Google Ads BL

ఉచిత పథకాలపై వెంకయ్య కామెంట్స్ వైరల్


ఏ రాష్ట్రంలో ఎన్నికల నగారా మొదలైన ఆయా పార్టీల మ్యానిఫెస్టోలో ఉచిత పథకాలని చేర్చి ప్రజలని మభ్యపెడుతూ ఉంటారు. చాలామంది ప్రజలు వాటిని నమ్మి ఆ పార్టీలని గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రతి పార్టీ ఇచ్చే పథకాల్లో తనకి ఏవి పనికొస్తాయో చూసుకుని మరీ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి వచ్చేసింది. పార్టీలు కూడా రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులని అంచనా వెయ్యకుండా ఉచిత పథకాలని ప్రకటించి ఓటర్లని ఆకర్షిస్తూ ఉంటారు. 

Advertisement
CJ Advs

అయితే  ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేఖమంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్‌లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా ప్రతి పార్టీ ఎన్నికల హామీలు ఇస్తుంటారని విమర్శించారు. 

అయితే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే దేశంలో పేద, మధ్యతరగతి, మధ్యతరగతికి దిగువన అనేక మంది ప్రజలు ఉన్నారని ఆయన చెప్పారు. మరి వెంకయ్య నాయుడు బిజెపి పార్టీలో కీలక పదవుల కొనసాగుతున్న సమయంలోనే ప్రధాని మోడీ ఆయనని ఉపరాష్ట్రపదవికి నామినేట్ చేసారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి సమయం ముగియడంతో ఆయన ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

Venkaiah Naidu comments on free schemes:

Venkaiah Naidu SEnsational comments on free schemes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs