హీరోయిన్స్ కి 40 ఏళ్ళ వయసులోనూ అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయంటే ఆ హీరోయిన్స్ లక్కీ అనే చెప్పుకోవాలి. కొన్నాళ్ళు కెరీర్ లో డల్ అయినా.. ఓకె ఒక సినిమాతో మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది హీరోయిన్ త్రిష. త్రిషకి 40 ఏళ్ళు. అయినా ఆమె అంత వయసున్న దానిలా కనబడదు. ఆమెకి ఏజ్ పెరుగుతున్న కొలది అందం మరింత పెరుగుతుంది అనేలా ఆమె రీసెంట్ లుక్స్ ఉంటున్నాయి. పొన్నియన్ సెల్వన్ రిజల్ట్ ఎలా ఉన్నా త్రిషకి మాత్రం ఆ సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. చిన్నా చితకా, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కాదు.
అన్నీ పెద్ద సినిమాలే. మణిరత్నం కమల్ హాసన్ తో చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా మల్టి స్టారర్ తగ్ లైఫ్ లోకి త్రిషని హీరోయిన్ గా తీసుకున్నారు. మరోపక్క అజిత్ తో ఓ ప్రాజెక్ట్ చేసినందుకు త్రిష కమిట్ అయ్యింది. అంతేకాకుండా మోహన్ లాల్ తో త్రిష ఛాన్స్ కొట్టేసింది అనే వార్త చూసిన వారు నిజంగా లక్కీ అంటే త్రిషనే. ఈ ఏజ్ లో ఇంత బిజీగా.. స్టార్ హీరోలతో కలిసి పని చేసే ఛాన్స్ వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు.
అంతేకాకుండా టాలీవుడ్ లో బాలయ్య-బాబీ కాంబినేషన్ లో మొదలు కానున్న సినిమాలోనూ త్రిషనే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ ఎంపిక జరగలేదు, త్రిష అయితే బావుంటుంది అని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లుగా టాక్.