Advertisement
Google Ads BL

గుంటూరు కారం: ధమ్ ఉన్న మసాలా !


మహేష్ ఫాన్స్ ఎప్పటినుంచో ఆరాటంగా, ఆత్రంగా ఎదురు చూస్తున్న సాంగ్ నేడు బయటికొచ్చింది. గుంటూరు కారం ధమ్ మసాలాగా మారి జనల చెవులకి ఘాటు పుట్టించింది. థమన్ మ్యూజిక్ ఎప్పటిలాగే దబిడిదిబిడి డ్రమ్స్ తో హోరెత్తించింది. 

Advertisement
CJ Advs

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న గుంటూరు కారం సినిమాపై ఎంతటి భారీ అంచనాలున్నాయో అందరికి తెలిసిందే. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ప్రమోషనల్ పనులు ఎట్టకేలకి నేడు ప్రారంభమయ్యాయి. ఎన్నాళ్ళనుంచో వార్తల రూపంలో ఊరిస్తూ వచ్చిన గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా అంటూ నేడు విడుదలయ్యింది. పక్కా మాస్ మసాలా అప్పీల్ తో ఉన్న ఈ సాంగ్ గుంటూరు కారం ఎంత మాసీగా ఉండబోతుందో, మహేష్ ని నెవ్వర్ బిఫోర్ మాస్ అవతార్ లో చూపించబోతుందో హింటిచ్చింది. ఇకపై రాబోయే ఇతర పాటల అప్ డేట్ కోసం, టీజర్ కోసం, ట్రైలర్ కోసం ఫాన్స్ వెర్రెత్తిపోవడం ఖాయం.

ఇంతకీ ఈ ధమ్ మసాలా ఎలా ఉందనేది స్పష్టంగా  చెప్పాలంటే రోస్ట్ ఎక్కువైపోయి టేస్ట్ తగ్గిపోయిన పాటగా పరిగణించాలి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అని టైటిల్ కార్డు వేయించుకునే సాహితి వేత్త స్థాయికి తగ్గ పాట కాదిది. హీరో ఎలివేషన్ అనగానే ధనాధన్ డ్రమ్స్ మాత్రమే వాయించేసే థమన్ కి మళ్ళీ ట్రోల్స్ తెప్పించే రిజల్ట్ ఇది. త్రివిక్రమ్ వంటి దర్శకుడి నుంచి ఆశించలేని అవుట్ ఫుట్ ఇది.

గుంటూరు కారం సినిమా విషయంలో ఫస్ట్ నుంచి వినిపిస్తున్న అంశం.. మ్యూజిక్ విషయంలో మహేష్ బాబు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. ఈ మేరకు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్టిల్ కానీ త్రివిక్రమ్ సహకారంతో నెట్టుకొస్తున్న థమన్ ఎన్ని ట్యూన్స్ మార్చి ఎంత చేసినా.. ఏమేరకు అవుట్ ఫుట్ వస్తుంది అనే సందేహం అభిమానుల్లో ఉండనే ఉంది. నేటి పాటతో థమన్ పై మహేష్ ఫ్యాన్స్ దాడి మరింత పెరిగే అవకాశం ఉంది. గుంటూరు కారం ఘాటు తెరపై ఎలా ఉంటుందో ప్రేక్షకులు చూసే ముందే త్రివిక్రమ్ - థమన్ ల జోడికి మహేష్ ఫ్యాన్స్ చూపించేస్తారేమో..!

Dum Masala from Guntur Kaaram: :

Guntur Kaaram: Dum Masala offers Mahesh Mass Masala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs