Advertisement

వాళ్ళ మాదిరే వరుణ్-లావణ్యలు కూడా


బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు సెలెబ్రిటీస్ పెళ్ళిళ్ళని ఓటిటీలకి అమ్ముకుని  కోట్లకి కోట్లు క్యాష్ చేసుకుంటున్నారు. అలానే కోలీవుడ్ లో నయనతార, హన్సికల పెళ్లి, బాలీవుడ్ లో కత్రినా కైఫ్, కియారా అద్వానీ ఇలా చాలామంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్లని వ్యాపారంలా మార్చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అభిమానులు, స్నేహితులు ప్రేమతో శుభాకాంక్షలు చెబుతారు అంతే. కానీ ఇలా పెళ్లి రైట్స్ ని అమ్ముకుంటే బోలెడన్ని డబ్బులొస్తాయి. అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఇప్పుడు టాలీవుడ్ జంట వరుజ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు కూడా తమ పెళ్లి హక్కులని ప్రముఖ ఓటీటీకి విక్రయించారనే న్యూస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అక్టోబర్ 30 న ఇటలీలో మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 2 వరకు అక్కడే కొనసాగాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. అయితే ఇటలీ వేదికగా జరిగిన పెళ్లి వేడుకలను నాగబాబు ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి విక్రయించారని అంటున్నారు. 

ఈ పెళ్ళికి సంబందించిన ప్రతి వేడుక ఓ వీడియో రూపంలో నెట్ ఫ్లిక్స్ లో రానున్నట్లుగా.. అతి త్వరలోనే వరుణ్-లావణ్య ల వివాహ వీడియో ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రముఖ సెలబ్రిటీస్ మాదిరే వరుణ్ తేజ్-లావణ్యలు కూడా తమ పెళ్లి హక్కులని అమ్మేసుకున్నారన్నమాట. 

Varun Tej Wedding Video to stream on Netflix:

Netflix acquires the rights of Varun Tej – Lavanya wedding footage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement