Advertisement
Google Ads BL

సలార్ పై మళ్ళీ అనుమానాలు స్టార్ట్


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సార్ మూవీపై మరోసారి అనుమానాలు రేకెత్తేలా సోషల్ మీడియా ట్వీట్లు చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన సలార్ మూవీ డిసెంబర్ 22 కి వస్తుంది అంటూ ఈమధ్యనే మేకర్స్ అనౌన్స్ చేసారు. మరోపక్క సలార్ ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు. దానితో సలార్ విడుదలపై ఊహాగానాలు మొదలైపోయాయి. పేరున్న వ్యక్తులే సలార్ ఒకవేళ డిసెంబర్ 22 కి రాకపోతే ఆ డేట్ కి రవితేజ ఈగల్ రిలీజ్ అవుతుంది అంటూ అనుమానాన్ని నాటారు.

Advertisement
CJ Advs

షారుఖ్ డుంకి తో పోటీ పడడమెందుకు అని ప్రభాస్ వెనక్కి తగ్గుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ఇలాంటి ఫేక్ న్యూస్ లపై పోరాడుతున్నా.. పదే పదే ఇలాంటి ట్వీట్స్ చూసిన అభిమానులు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. ఇలాంటి ఫేక్ ట్వీట్స్ వలన అభిమానులు అయోమయానికి గురవుతున్నారు అంటూ వారు కోపంతో ఊగిపోతున్నారు. 

సలార్ విషయంలో ఇలాంటి న్యూస్ లు ఆగాలంటే మేకర్స్ ఏదో ఓకే అప్ డేట్ ఇవ్వాలంటూ వారు సలార్ నిర్మాతలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చూసైనా మేకర్స్ ఎలాంటి తొందర పడకుండా కూల్ గా కనిపించడం చూస్తే ఇలాంటి రూమర్స్ నిజమనుకునే ప్రమాదం లేకపోలేదు. 

Suspicions start again on Salaar:

Salaar Vs Dunki: Is Prabhas starrer postponed to 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs