బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం కంప్లీట్ చేసుకుని పదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు పదిమంది ఎలిమినేట్ అయినా.. అందులో రతిక రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హౌస్ లో పదిమంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఇక నిన్న ఆదివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాడు. ఇక ఈవారం నామినేషన్స్ కూడా హౌస్ ని హీటెక్కించాయి. ఈ వారం అమ్మాయిలంతా రాజమాతలుగా మారిపోయి నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యింది. ప్రియాంక, శోభ, అశ్విని, రతికలు రాజమాతలుగా ఉంటారు.
అబ్బాయిలు అబ్బాయిలనే నామినేట్ చెయ్యాలి. అందులో అమరదీప్ భోలే ని టార్గెట్ చేసాడు. ఆయన తన నల్ల బాల్ గురించి డిపెండ్ చేసుకోలేదు అంటూ అతన్ని నామినేట్ చేసాడు. భోలే కూడా ఫైట్ చేసాడు. ఆ తర్వాత గౌతమ్ కి శివాజీ మధ్యన చాలా రచ్చ జరిగింది. ఒక అమ్మాయి చెప్పింది పట్టుకుని నువ్ శివాజీ పై అలిగేషన్ చేసావ్ అంటూ అబ్బాయిల్లో చాలామంది గౌతమ్ ని టార్గెట్ చేసారు. ఒకసారి కెప్టెన్ అయినవాడు మళ్ళీ కెప్టెన్ అవ్వనివ్వను అంటూ శివాజీ అన్నది తప్పు అని గౌతమ్ అన్నాడు.
నువ్వు కెప్టెన్ అయ్యి ఉండి మరొకరి మాటపట్టుకుని అలా మాట్లాడావ్ అంటూ పల్లవి ప్రశాంత్ గౌతమ్ ని టార్గెట్ చెయ్యగా.. అలానే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావ్ అంటూ వాడిని పొడిచిన ప్రతిసారి పల్లవి ప్రశాంత్ అందరికి రివెంజ్ నామినేషన్స్ వేస్తాడు అంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. తర్వాత ప్రియాంక గౌతమ్ నువ్వు చేసింది కరెక్ట్ కాదని అందరూ పాయింట్ తీస్తున్నారు అంది. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ కి అమరదీప్ కి కూడా గొడవ జరిగిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.