Advertisement
Google Ads BL

నాగబాబుని లైట్ తీసుకున్నారా..


మెగా బ్రదర్ నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నవంబర్ 1 న ఇటలీ వేదికగా కుటుంభ సభ్యుల మధ్యన ఘనంగా జరిగింది. ఇటలీ టుస్కనీ నగరంలో జరిగిన ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ-లావణ్య త్రిపాఠి కుటుంభం సభ్యులతో పాటుగా కొద్దిమంది స్నేహితులు మత్రమే హాజరయ్యారు. అది డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి ఎవరూ అంత దూరం వెళ్లలేరని.. ఇక్కడ హైదరాబాద్ లో నాగబాబు వరుణ్ తేజ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని ఆదివారం  సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో జరిపించారు.

Advertisement
CJ Advs

అయితే ఈ రిసెప్షన్ కి నందమూరి హీరోలు కానీ, ఇంకా సీనియర్ హీరోలు కానీ చాలామంది హాజరవలేదు. వరుణ్ తేజ్ వయసు వాళ్ళైన సందీప్ కిషన్, నవదీప్, నాగ చైతన్య ఇలా కొంతమంది హాజరయ్యారు. అటు నాగార్జున ఫ్యామిలీ కానీ, బాలయ్య కానీ ఇలా ఎవరూ కనబడలేదు. నాగబాబు హీరో గా కొన్ని సినిమాలు చేసినా.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఆ తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోలకి తండ్రి పాత్రల్లో కనిపిస్తున్నారు. మరి నాగబాబు మీద గౌరవంతో అయినా ఆయా హీరోలు వరుణ్ తేజ్ రిసెప్షన్ కి వస్తే బావుండేది అనేది కొంతమంది అభిప్రాయం. 

మెగా ఫ్యామిలీ నుంచి మెగా స్టార్ తప్ప రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అల్లు అర్జున్ ఇలా ఎవ్వరూ కనబడలేదు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ లు మాత్రమే కనిపించారు. చిరు కూతుళ్లు కాని ఎవ్వరూ రాలేదు. నిహారిక మాత్రం అన్న రిసెప్షన్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది. మరి నాగబాబు ని సినీ ప్రముఖులు ఇంత లైట్ తీసుకున్నారా అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి. 

Huge Celebrities avoid Varun Tej Reception:

Varun Tej-Lavanya Tripathi wedding reception highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs