బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పూల్టా అంటూ నాగార్జున యాజమాన్యం కూడా కొత్తగా చూపించాలనుకుంటున్నారు. అందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉల్టా పూల్టాలో భాగంగా ఐదుగురు కంటెస్టెంట్స్ ని నెల తర్వాత హౌస్ లోకి పంపించారు. ఆ తరవాత ఎలిమినేట్ అయిన ముగ్గురిలో అతి తక్కువ ఓటింగ్ వచ్చిన రతికని రీ ఎంట్రీ ఇప్పించారు. గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. ఇలా ఎప్పుడేం జరుగుతుందో అంటూ యాజమాన్యం రకరకాలుగా బిగ్ బాస్ ని పరిగెత్తిస్తున్నారు.
ఇక ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. శోభా శెట్టి ఏడుస్తూ తేజని బయటికి పంపించింది. తేజ ఎలిమినేట్ అవడం సందీప్ మాస్టర్ ని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసినందుకే కర్మ రిటన్స్ అంటూ సందీప్ మాస్టర్ తో పాటుగా ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ఇపుడు తేజ ఎలిమినేట్ అవగా.. సందీప్ మాస్టర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. ఉల్టా పూల్టాలో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన సందీప్ ని రీ ఎంట్రీ ఇప్పించబోతున్నారంటున్నారు.
ప్రస్తుతం హౌస్లో శివాజీ, అర్జున్, అమరదీప్, శోభా శెట్టి, గౌతమ్, పల్లవి ప్రశాంత్, భోలే, ప్రియాంక, రతిక, అశ్విని లు ఉన్నారు. 15 వారాల బిగ్ బాస్ ఆటకి ఐదు వారాల్లో మరో ఐదుగురు ఎలిమినేట్ అవుతారు. అయితే మధ్యలో డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి సందీప్ ని హౌస్ లోకి రీ ఏంటి ఇప్పించి ఒక వారం ఇద్దయిరని ఎలిమినేట్ చేస్తారంటూ చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.