Advertisement
Google Ads BL

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన మరదలు


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్సార్‌‌సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. పురందేశ్వరి వైసీపీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఆయుధాలుగా మలుచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు వైపు సంధించడమే విస్తుబోయేలా చేస్తోంది. అసలే చంద్రబాబును ఎలా వేధించాలి? ఎన్ని రకాలుగా వేధించాలని పలు రకాల కేసులు సిద్ధం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పురందేశ్వరి చేస్తున్న ఆ పార్టీపై చేస్తున్న ఆరోపణలు బాగా కలిసొస్తున్నాయి. 

Advertisement
CJ Advs

పురందేశ్వరి ఆరోపణలే అస్త్రాలుగా..

పురందేశ్వరి ఏమైతే బయటికి వైసీపీ బాగోతాలు బయటికి తీస్తున్నారో .. చంద్రబాబుపై ఆ కేస్ ఓపెన్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఆ మధ్య పురందేశ్వరి ఇసుక ఆరోపణలు చేశారు. వెంటనే చంద్రబాబుపై ఇసుక కేసు. ఉచిత ఇసుక విధానం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిదంటూ కేసు నమోదు చేశారు. ఇక పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై లిక్కర్ ఆరోపణలు చేశారు. ఆ వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు ఓపెన్ చేశారు. అప్పటి అధికారుల ప్రతిపాదనల మేరకు మద్యం విధానంలో అవసరమైన మార్పులు చేసినందుకు ‘లిక్కర్‌ కేసు’ నమోదు చేయడం జరిగింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా కానీ వైసీపీ పట్టించుకోదు.

పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ..

మేలు చేసినా నేరంగానే పరిగణించి మరీ కేసులు నమోదు చేస్తోంది. అసలు రేపొద్దున పురందేశ్వరి మరే ఆరోపణ చేస్తారా? దానిని చంద్రబాబుకు అన్వయించి ఎలా కేసు నమోదు చేయాలా? అని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తానికి చంద్రబాబుకు మరదలు తలనొప్పిగా మారారంటూ టాక్ నడుస్తోంది. పురందేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డిల మధ్య ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇక ఆయన ఊరుకుంటారా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో పురందేశ్వరి బహునేర్పరి అని.. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వార్ ఎంత వరకూ వెళుతుందో చూడాలి.

Purandeswari became a headache for Babu:

Purandeswari became a headache for ChandraBabu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs