అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యాన్ ఇండియా సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అల్లు అర్జున్ వారం క్రితం ఇటలీ వెళ్లడంతో షూటింగ్ కి కాస్త బ్రేకిచ్చిన సుకుమార్ మళ్ళీ మంగళవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు ముగించుకుని మెగా హీరోలంతా శనివారమే ఇటలీ నుంచి హైదరాబాద్ కి వచ్చేసారు. మెగాస్టార్ నుంచి వరుణ్ తేజ్ వరకు అందరూ హైదరాబాద్ కి చేరుకున్నారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం ఈరోజే ఆదివారం ఇటలీ నుంచి తన ఫ్యామిలీతో పాటుగా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో జరుగుతున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల రిసెప్షన్ కి భార్య స్నేహతో కలిసి హాజరు కానున్న అల్లు అర్జున్ రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి నుంచి పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.
పుష్ప 2 షూటింగ్ డిసెంబర్ కల్లా ఆల్మోస్ట్ పూర్తి అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడని వచ్చే ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయించి ఆగష్టు 15 న పుష్ప 2 ని ప్యాన్ ఇండియా ప్రేక్షకుల తో పాటుగా మరికొన్ని ఇతర దేశాల్లో విడుదల చేసేందుకు సుక్కు ప్లాన్ చేసుకున్నారట.