గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో టేస్టీ తేజ నామినేట్ చేసిన వారంతా వరసగా ఎలిమినేట్ అవుతున్నారు. దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజ, గత వారం సందీప్ మాస్టర్. సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తూ తేజ వాళ్ళని హౌస్ నుంచి పంపించేసాడంటూ అతని నామినేషన్ ని అందరూ ఐరెన్ లెగ్ గా ముద్ర వేశారు. గత వారం కేవలం తేజ వేసిన నామినేషన్ తోనే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడంటూ చాలామంది ఇంక్లూడింగ్ హౌస్ లోని వారు కూడా అభిప్రాయపడ్డారు.
శివాజీ అయితే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ సందీప్ మాస్టర్.. నీ సిల్లీ రీజన్ వల్లే ఎలిమినేట్ అయ్యాడు, అలా చెయ్యకుండా ఉండాల్సింది అంటూ తేజని నామినేట్ చేసాడు. ఫైనల్ గా ఈరోజు ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లుగా లీకులు వినిపిస్తున్నాయి. దానితో సందీప్ మాస్టర్ కర్మ రిటర్న్ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తేజని ఉద్దేశించే పెట్టాడంటూ మాట్లాడుకుంటున్నారు. తేజ వలన ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో ఇప్పుడు ఆ కర్మ తేజని ఎలిమినేట్ చేసింది అనేలా ఆ పోస్ట్ ఉంది అంటున్నారు.