మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో క్రేజీ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం ఫస్ట్ సింగల్ పై అంతకంతకు హైప్ పెరిగిపోతుంది. మేకర్స్ లేట్ చేసే కొలది అభిమానులు అసహనంగా ఫీలవుతున్నా.. రాబోయే సింగిల్ పై ఉన్న క్రేజ్ తో కూల్ అవుతున్నారు. ఈ వారంలోనే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ రాబోతుంది అని నిర్మాత నాగవంశీ గట్టిగానే చెప్పారు. నవంబర్ 7 న త్రివిక్రమ్ బర్త్ డే గిఫ్ట్ గా గుంటూరు కారం సింగిల్ వదులుతారనే ఆశలో ఫాన్స్ ఉన్నారు.
థమన్ కూడా సిన్సియర్ గా ఫస్ట్ సింగిల్ కోసం కష్టపడుతున్నాడు. అటు పాట చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఈలోపులో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ నుంచి ఆడియో లీక్ వార్త సోషల్ మీడియాని కమ్మేసింది. దానితో చిత్ర బృందం షాకయ్యింది అని తెలుస్తోంది. ఆడియో ఫైల్ లీక్ అయిందంటూ కొంతమంది చిన్న క్లిప్ ని వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారట. దానితో పాటుగా రెండు ట్విట్టర్ లింక్స్ కూడా షేర్ చెయ్యడంతో.. ఆ లీకైన సాంగ్ విన్న వారంతా గుంటూరు కారం సాంగ్ లీక్ నిజమే అంటున్నారు.
మరి రేపో మాపో అఫీషియల్ గా విడుదల కావాల్సిన సాంగ్ ఇలా లీకై సోషల్ మీడియాలో వైరలవడం అనేది నిజంగా షాకింగ్ న్యూస్. మేకర్స్ ఫస్ట్ సింగిల్ పై తాత్సరం చేసేకొలది ఇలాంటి న్యూస్ లే చూడాల్సి వస్తుంది అంటూ మహేష్ అభిమానులే మాట్లాడుకోవడం అసలు సిసలైన విడ్డూరం.
..