సలార్ మేకర్స్ అప్ డేట్ ఆలస్యం చెయ్యడంతో సోషల్ మీడియాలో సలార్ పై రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సలార్ రెండు భాగాలుగా కాదు సలార్ ని ఒక్కటిగానే రిలీజ్ చేస్తున్నారు. రెండో భాగంలో ఉండాల్సిన సీన్స్ మొదటిభాగంలో పెట్టేసారు, ఐటెం సాంగ్ అన్నారు అది కూడా తీసేసారు.. సినిమాలో ఒకే ఒక సాంగ్.. అది కూడా అమ్మకి సంబందించిన పాట మాత్రమే ఉంటుంది అని ఒకరోజు, మరొకరోజు సలార్ మొదటి భాగం డిసెంబర్ 22 న విడుదలయితే.. రెండో భాగం కూడా చాలా త్వరగానే విడుదలవుతుంది అని.
కాదు సలార్ డిసెంబర్ 22 న విడుదల కావడం లేదు, 2024 లోనే సలార్ అంటూ ఇలా ఏవేవో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు సలార్ టీజర్, పోస్టర్స్ తప్ప మరో అప్ డేట్ లేకపావడమే ఇన్ని పుకార్లకి కారణం. సలార్ ట్రైలర్ వస్తే అన్నీ సెట్ అవుతాయనుకుంటే.. సలార్ ట్రైలర్ పై మేకర్స్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడమే లేదు. కానీ డిసెంబర్ 22 నే ఖచ్చితంగా సలార్ వస్తుంది అనేలా ఓవర్సీస్ లో సలార్ కదలికలు ఉన్నాయి.
సో సలార్ విడుదలపై సందేహాలు వద్దు అంటున్నారు, సినిమా విడుదల పక్కా ఈ ఏడాదే ఉంటుంది అంటున్నారు. మరి కొంతమంది సలార్ పై విషం చిమ్ముతూ ట్వీట్స్ వెయ్యడంతో ప్రభాస్ ఫాన్స్ ఆ విషయంలో ఫైర్ అవుతున్నారు. షారుఖ్ డుంకి ని హైలెట్ చేస్తూ సలార్ ని కించపరుస్తున్నారు. డుంకి టీజర్ బావుంది.. సలార్ టీజర్ KGF లా ఉంది అంటూ కావాలనే నెగెటివిటి స్ప్రెడ్ చేస్తున్నారంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.