Advertisement
Google Ads BL

కొత్త జంటతో నితిన్ కపుల్


ఇటలీలో జరిగిన హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠీల వివాహానికి టాలీవుడ్ నుంచి హాజరైన స్నేహితుల్లో నితిన్ ఒకరు. నితిన్ తన భార్య షాలిని తో కలిసి వరుణ్ తేజ్ పెళ్ళికి వెళ్ళాడు. అక్కడ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల కాక్ టైల్ పార్టీకి, అలాగే మెహిందీ, సంగీత్ లలో పాల్గొనడమే కాదు.. నిన్న సాయంత్రం వరుణ్ తేజ్-లావణ్య ల వివాహం తర్వాత నితిన్ జంట.. కొత్త జంటతో కలిసి దిగిన పిక్ ని నితిన్ ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. To happily ever after Varun Tej and Lavanya Tripathi ❤️ Congratulations 🥂 అంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసాడు.

Advertisement
CJ Advs

వరుణ్ తేజ్-లావణ్యలు కూర్చోగా.. వారికి వెనుకగా నితిన్ జంట నించుని ఫొటోలకి ఫోజులిచ్చారు. నితిన్ ఆయన భార్య షాలిని వరుణ్ తేజ్ పెళ్ళిలో ఎంతగా ఎంజాయ్ చేసారో ఇలా బయటికొచ్చిన పిక్స్ చూస్తే తెలుస్తుంది.  వరుణ్ తేజ్ పెళ్ళికి టాప్ డిజైర్ నీరజ కోన కూడా హాజరైంది. వరుణ్-లావణ్యల వివాహం ఫ్యామిలీ-ఇంకా అల్లు ఫ్యామిలీ, లావణ్య కుటుంబాల మధ్యన ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. 

నవంబర్ 5 న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహ రిసెప్షన్ ని నాగబాబు గ్రాండ్ గా ఆరెంజ్ చేసారు. ఇక్కడ జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తుంది. 

Nithin and his wife attends Varun-Lavanya wedding:

Nithiin and his wife Shalini at Varun teja and Lavanya Tripathi wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs