ప్రస్తుతం సోషల్ మీడియాలో గుంటూరు కారం vs గేమ్ ఛేంజర్ అన్నట్టుగా మెగా అభిమానులు, ఘట్టమనేని అభిమానులు పోటీ పడుతున్నారు. కారణం ఈ దీపావళికి గేమ్ ఛేంజర్ నుంచి, గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్స్ రాబోతున్నాయి. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ విషయంలో సోషల్ మీడియాలో నానా హడావిడి జరుగుతుంది. కారణం నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం పై ఇస్తున్న అప్ డేట్స్. గేమ్ ఛేంజర్ కన్నా ఒకింత గుంటూరు కారం పైనే క్రేజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో మెగా ఫాన్స్ అలెర్ట్ అయ్యారు.
సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ హాష్ టాగ్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. రామ్ చరణ్-శంకర్ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్స్ ఆలస్యమవడంతో ఆకలిమీదున్న మెగా ఫాన్స్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ దివాళికి అని అనౌన్స్ చెయ్యగానే తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అటు గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అంటూ ఊరిస్తూ దానికి సంబందించిన ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో మహేష్ అభిమానులు అసహనంతో ఉన్నారు.
ఇప్పటికే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అనుకున్న సమయానికి రాకపోవడంతో మహేష్ అభిమానులు డిస్పాయింట్ మోడ్ లో ఉన్నారు. ఈ వారంలోనే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అంటూ నాగవంశీ ఇచ్చిన న్యూస్ తో మహేష్ అభిమానులు గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.