పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులోనే ఉంది పవర్. సినిమాల్లో ఆయనకుండే క్రేజ్, ఆయన స్టయిల్ కి పడిపోయే ఫాన్స్ కోకొల్లలు. కానీ పవన్ కళ్యాణ్ బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ఎటువంటి ఆడంబరాలకు పోరు, కోటు సూటు అని స్టయిల్ కొట్టరు. చాలా సింపుల్ గా హుందాగా కనిపిస్తారనేది అందరికి తెలిసిన విషయమే. బయటికెళితే హ్యాంగర్ కున్న చొక్కా వేసుకుని వెళ్లిపోయేట్టుగా ఉంటుంది ఆయన డ్రెస్సింగ్ స్టయిల్. కానీ సినిమాల్లో మాత్రం దర్శకులు ఎలా చెబితే అలా చాలా స్టయిల్స్ చూపిస్తారు.
తాజాగా పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీకి వెళ్లారు. భార్య అన్నా లెజెనోవాతో పాటుగా పవన్ ఇటలీకి వెళ్లారు. అక్కడ పెళ్ళిలో ఆయన మరీ సింపుల్ గా దర్శనమిచ్చారు. క్యాజువల్ లుక్స్ తో కనిపించారు. మెగాస్టార్ చిరు దగ్గర నుంచి సాయి ధరమ్, వైష్ణవ తేజ్, అల్లు అర్జున్ వరకు పెళ్ళికి వేసుకునే అవుట్ ఫిట్స్ లో అదిరిపోయే స్టయిల్ తో కనిపిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం ఓ టీ షార్ట్ వేసుకుని చాలా సింపుల్ గా కనిపించడం చూసిన నెటిజెన్స్ అదేమిటి పవన్ మరీ అంత సింపులా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
కొణిదెల ఫ్యామిలీ మొత్తం ఒకే ఫొటోలో కనిపించారు. మెగాస్టార్ చిరు-సురేఖ, నాగబాబు-పద్మజ, పవన్ - అన్నా లెజెనోవా, అలాగే మెగాస్టార్ చిరంజీవి సిస్టర్స్, వాళ్ళ భర్తలతో కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాజకీయాల్లోనూ వైట్ లుంగీ, పైజామాలో కనిపిస్తారాయన. బయట ఏ ఈవెంట్ కి వెళ్ళినా టక్ చేసుకుని స్టయిల్ గా కనిపిస్తారు. ఇప్పుడు వరుణ్ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ సింపుల్సిటీకి మెగా అభిమానులే కాదు.. అందరూ షాకవుతున్నారు.