Advertisement
Google Ads BL

ఫైనల్లీ నాగ చైతన్య దూతకి మోక్షం


నాగ చైతన్య-విక్రమ్ కుమార్ కలయికలో వచ్చిన థాంక్యూ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో.. థాంక్యూ విడుదలకు ముందే తెరకెక్కిన దూత వెబ్ సీరీస్ విడుదల ఆలస్యమైంది. థాంక్యూ విడుదలకు ముందే దూత షూటింగ్ పూర్తి చేసారు విక్రమ్ కుమార్. కానీ థాంక్యూ ఫెయిల్యూర్ అవడం, అటు కస్టడీ మూవీ డిసాస్టర్ అవడంతో దూత వెబ్ సీరీస్ విడుదల విషయం అందరూ మరిచిపోయారు. కానీ తాజాగా దూత వెబ్ సీరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Advertisement
CJ Advs

ఎందుకంటే దూత వెబ్ సీరీస్ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ వెబ్ సీరీస్ రిలీజ్ ఆల్మోస్ట్ ఫిక్స్. ఆ తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారట. 40 నిమిషాల నిడివి వుండే 8 ఎపిసోడ్ లు డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ ప్లాట్ ఫారమ్ లో విడుదలవుతాయి అని.. నాగ చైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో రాబోతున్న ఈ సీరీస్ ని శరత్ మరార్ 40 కోట్ల రూపాయలతో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్ళకి ఈ వెబ్ సీరీస్ విడుదలకు సిద్ధమైంది.

విక్రమ్-చైతూ కాంబోలో వచ్చిన థాంక్యూ సినిమా నిరాశపరిచినా.. దూత వెబ్ సీరీస్ అయినా నాగ చైతన్యకి హిట్ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం చైతు చందు మొండేటి తో కొత్త సినిమాని మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఆ చిత్రం కోసమే రఫ్ గా మేకోవర్ అయ్యాడు.

Dootha web series is gearing up for an OTT release:

Naga Chaitanya Dootha Arriving
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs