బిగ్ బాస్ సీజన్ 7 లో టాస్క్ ల విషయంలో ఎలా ఉన్నా గత మూడు వారాలుగా నామినేషన్స్ హీట్ హౌస్ లో మాములుగా లేదు. నామినేషన్స్ లో ఎవరికి వారు తగ్గడం లేదు. ప్రియాంక, శోభా శెట్టి లు అయితే నోళ్లేసుకుని పడిపోతున్నారు. శివాజీ మైండ్ గేమ్ ఆడేస్తున్నాడు. అర్జున్ లాంటి వాళ్ళు నామినేషన్స్ విషయంలో క్లారిటీగా ఉన్నా కొంతమంది మాత్రం గొడవలతో హౌస్ ని అలాకొల్లోలం చేస్తున్నారు. ఈ వారం అమరదీప్ vs భోలే అన్న రేంజ్ లో నిన్నటి ఎపిసోడ్ గొడవలు జరిగాయి.
ఇక ఈ రోజు మంగళవారం ఎపిసోడ్ లో ప్రిన్స్ యావర్ అశ్వినిని నామినేట్ చేసాడు. నువ్వు ఎవ్వరిలో కలవవు.. రెండు వారాలైనా అలానే ఉన్నావ్ అంటూ అశ్వినిని నామినేట్ చేసాడు. దానితో అశ్విని కి బాగా కోపమొచ్చింది.. యావర్ తో గొడవేసుకుని మధ్యలో నన్ను ఆడపిల్లని చేసి ఆడుకుంటున్నావ్ నీకు ఇంగ్లీష్ అర్ధమవుతుందా అంటూ వెటకారం చేసింది. ఆ తర్వాత యావర్ ని అశ్విని నామినేట్ చేసింది. నువ్వు అస్సలు నా మైండ్ లో లేవు, కానీ నన్ను నామినేట్ చేసావ్ అందుకే నిన్ను చేస్తున్నా అంది.
దానితో యావర్ కూడా రివెంజ్ నామినేషనా అంటూ కామెడీ చేసాడు. ఆ తర్వాత యావర్ శోభని నామినేట్ చేస్తూ ఎప్పటిలాగే గొడవపడ్డాడు. రతిక శోభా ని నామినేట్ చేస్తూ గ్రూప్ గేమ్ గురించి మరోసారి మాట్లాడింది. అందులో తేజ పేరు తియ్యగానే తేజ లేచాడు. నువ్వెందుకు నా పేరు తీసావ్ అంటూ గొడవ పడ్డాడు. ఇక గౌతమ్ అమరదీప్ ని నామినేట్ చేస్తూ నువ్వు సంచాలక్ గా నన్నే వాడుకుందామని అనుకున్నావ్ అందుకే నామినేట్ చేశాను అన్నాడు. అమరదీప్ కూడా గౌతంపై మాటల యుద్దానికి దిగాడు. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్ లోకి వచ్చారో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.