మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ ఫస్ట్ సింగిల్ కోసం మహేష్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. వినాయక చవితి అన్నారు, దసరా అన్నారు ఆ రెండు పండగలు వెళ్లిపోయాయి. నిర్మాత నాగవంశీ దీపావళికి గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది అని హామీ ఇచ్చారు, అటు చూస్తే గుంటూరు కారం సాంగ్ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. దానితో మళ్ళీ మహేష్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మహేష్ కూడా ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్స్ లో ఉన్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం సాంగ్ చిత్రీకరణ నవంబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు చేపట్టనున్నారట. మహేష్ బాబు-హీరోయిన్ శ్రీలీల పై ఈ పాట చిత్రీకరణ ఉంటుంది అని.. ఈ పాటనే దివాళికి వదిలే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని.. అభిమానులెవరూ ఆందోళన పడవల్సిన అవసరమే లేదు అంటూ ఈ అప్ డేట్ మహేష్ ఫాన్స్ ని కూల్ చేసింది.