Advertisement
Google Ads BL

భగవంత్ కేసరి ఓటిటి డేట్


బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి దసరా సందర్భంగా అక్టోబర్ 19 న విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడిన భగవంత్ కేసరిని కుటుంబ ప్రేక్షకులు మెచ్చడంతో ఈ సినిమా హిట్ దిశగా పరుగులు పెట్టింది. బాలయ్యకి అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. అనిల్ రావిపూడి సినిమాని ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తూ గుడులు గోపురాలు తిరుగుతున్నాడు. ఈ రోజు సోమవారం హీరోయిన్ శ్రీలీల, ఇంకా టీమ్ తో కలిసి విజయవాడ కనకదుర్గని దర్శించుకున్నారు.

Advertisement
CJ Advs

థియేటర్స్ లో రెండో వారము మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ డిజిటల్ పార్ట్నర్. బాలయ్య వరస హిట్స్ తో ఉండడంతో భగవంత్ కేసరికి భారీ డీల్ తో అమెజాన్ ప్రైమ్  ఓటిటి హక్కులు దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని  50 రోజుల తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ చెయ్యాలని మేకర్స్ భావించారు. తాజా సమాచారం ప్రకారం భగవంత్ కేసరిని నవంబర్ 23 న  స్ట్రీమింగ్ చేస్తారనే ప్రచారం మొదలైంది.

థియేటర్స్ లో హిట్ అయినా, ప్లాప్ అయినా.. సినిమా విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటిటి కి వచ్చేస్తున్న ఈ రోజుల్లో భగవంత్ కేసరి కూడా అలానే సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటిటికి రంగం సిద్ధం చేసుకుంటుంది అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వారు కూడా మూవీ విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సో నవంబర్ 23 న ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు భగవంత్ దిగుతాడన్నమాట.

Bhagavanth Kesari OTT Date:

Bhagavanth Kesari Will Stream In OTT From This Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs