Advertisement
Google Ads BL

రెండో పెళ్లి రూమర్స్ పై నటి ఫైర్


సీనియర్ నటి ప్రగతి వెండితెర అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం బుల్లితెర ఎంట్రీకి రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో స్టార్ మా లో ఓ సీరియల్ మొదలు కాబోతుంది. సిల్వర్ స్క్రీన్ పై తల్లి పాత్రలతో మెప్పించిన ప్రగతి కొద్దిరోజులుగా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. జిమ్ వీడియోస్, అలాగే డాన్స్ వీడియోస్ తో అదరగొట్టేసే ప్రగతి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతుంది అది కూడా టాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాతనే ప్రగతి పెళ్లాడబోతుంది అంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

కొన్నేళ్లుగా ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా ప్రగతి జీవితాన్ని గడుపుతోంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతే ప్రగతి వద్ద పెళ్లి ప్రపోజల్ తెచ్చినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తలను ప్రగతి ఖండించింది. బాధ్యత కలిగిన ఓ మీడియా సంస్థలో నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నటుగా ఫేక్ న్యూస్ రాసారు. 

నేను ఒక నటిని కాబట్టి అధరాలు లేకుండా ఇలాంటి వార్తలు ఎలా రాసేస్తారా.. నా పర్సనల్ లైఫ్ పై ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు. ఆ వార్తలు రాసిన వారు నా రెండో పెళ్లి గురించి ఏమైనా కల కన్నారేమో అంటూ ప్రగతి తన రెండో పెళ్లి వార్తలని కొట్టిపారేసింది. అంతేకాకుండా ప్రగతి సదరు పత్రికపై ఫైర్ అయ్యింది. తెలిసి తెలియని వార్తలు రాసి తమ వ్యక్తిగత జీవితాలను ఇబ్బందులు పాలు చెయ్యొద్దు అంటూ సీరీస్ అయ్యింది. 

Actress fires on second marriage rumours:

Actress Pragathi fires on second marriage rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs