Advertisement
Google Ads BL

కావలి RTC డ్రైవర్ ను కొట్టిన టీడీపీ, జనసేన రౌడీలు


రెండు రోజుల క్రితం కావలిలో బస్సు డ్రైవర్ పై జరిగిన దాడి సామజిక మాధ్యమాలలో పెను సంచలనం సృష్టించింది. బస్సు డ్రైవర్ పై కొంతమంది వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసి కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు చట్ట పరంగా తీసుకుంటామన్నారు. డ్రైవర్‌పై దాడి చేసినవ్యక్తులుపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
CJ Advs

అసలు ఎక్కడా ఎలా ఈ ఘటన జరిగింది అంటే.. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి కావలి మీదుగా విజయవాడ వెళుతోంది. కావలిలోని ట్రంకురోడ్డులో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తన ముందున్న బైక్‌ అడ్డు తీయాలంటూ హారన్‌ మోగించాడు. దానితో ఆ బైక్ పై ఉన్న వ్యక్తి వాదనకు దిగడంతో అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత ఆ బైక్ పై ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని తన స్నేహితులకి చెప్పి బస్సు డ్రైవర్ ని ఫాలో అయ్యి మరీ మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాముల దగ్గర బస్సును ఆపి.. డ్రైవర్ ని బస్సులో నుంచి కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనను బస్సులోని ఓ ప్రయాణీకుడు రికార్డు చేస్తుండగా అతడి మొబైల్‌ను ధ్వంసం చేశారు. 

అయితే డ్రైవరుపై దాడి చేసిన నిందితులపై నేరారోపణలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. గుర్రంకొండ సుధీర్, గుర్రంకొండ అరుణ్ కుమార్, శివారెడ్డి, గంజి ప్రసన్న ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చెయ్యగా దేవరకొండ సుధీర్ సహా మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతున్నట్టు ఎస్పీ వెల్లడించారు. 

వీరు టీడీపీ, జనసేన పార్టీలకి చెందినవారిగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీలకి చెందిన వారే బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడి ప్రజలని భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడిన రౌడీషీటర్లపై వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల వివరాలను వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. 

TDP Propagating RTC Driver issue towards YSRCP:

Police introduces accused of attack on RTC Driver before media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs